Advertisementt

త్రిశంకు లిరికల్ వీడియో సాంగ్

Wed 16th Jun 2021 05:15 PM
versatile hero rana daggubati,lyrical song,yedu rangula song,trishanku film  త్రిశంకు లిరికల్ వీడియో సాంగ్
Rana Unveiled The Lyrical Song Of Yedu Rangula From Trishanku Film త్రిశంకు లిరికల్ వీడియో సాంగ్
Advertisement
Ads by CJ

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోద‌రుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం త్రిశంకు. 

ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సుమ‌న్‌, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల‌ మూవీ నుండి ఫ‌స్ట్ లిరికల్ సాంగ్ ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా ను టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి విషెస్ తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకి సునీల్ క‌శ్య‌ప్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. భాష్యశ్రీ సాహిత్యం అందించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు అని అన్నారు.

నిర్మాతలు లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న మాట్లాడుతూ.. దర్శకుడు  శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన  రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం అన్నారు. 

Rana Unveiled The Lyrical Song Of Yedu Rangula From Trishanku Film:

Versatile Hero Rana Daggubati Unveiled The Lyrical Song Of Yedu Rangula From Trishanku Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ