Advertisementt

లోల్‌సలామ్‌ ట్రైలర్‌ రిలీజ్ చేసిన నాని

Tue 15th Jun 2021 12:31 PM
lol salam web series,lol salam web series trailer,lol salam trailer released,hero nani  లోల్‌సలామ్‌ ట్రైలర్‌ రిలీజ్ చేసిన నాని
Lol Salam Trailer released by Nani లోల్‌సలామ్‌ ట్రైలర్‌ రిలీజ్ చేసిన నాని
Advertisement
Ads by CJ

విభిన్నమైన కథాంశంతో కూడుకున్న కొత్తరకం ప్రయత్నాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కంటెంట్‌ బాగుంటే అది సినిమా అయినా వెబ్‌సిరీస్‌ అయినా ఆదరణలో ఎటువంటి తేడా వుండదు. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో  వైవిధ్యమైన కథాంశంలతో పలు వెబ్‌సిరీస్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ఓ చక్కటి కథాంశంతో ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ‘లోల్‌సలామ్‌ ’ పేరుతో జీ-5ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో

 ఓ వెబ్‌సీరిస్‌ రాబోతుంది. ఆరు ఏపిసోడ్స్‌లతో పూ ర్తివినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్‌సీరిస్‌ జీ-5 ఓటీటీలో ఈ నెల 25న విడుదల కాబోతుంది. కాగా ఈ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్టర్‌ ద్వారా విడుదల చేసి తన శుభాకాంక్షలు అందజేశాడు. ఈ వెబ్‌సీరిస్‌ విశేషాలను క్రియేటర్‌ అండ్‌ డైరెక్టర్‌ నాని తెలియజే స్తూ కరోనాతో ఒత్తిడితో  వున్న అందరిని పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌ చేయడమే మా ధ్యేయం దైనందిన జీవితంలో వున్న టెన్షన్‌లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురి యువకుల్లో అనుకోకుండా ఒకరు

అనుకోకుండా ఆ  అడవిలో ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వా ళ్లు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు అనేది పూ ర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచాం. 40 కొత్త ఆర్టిస్టులతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాం అని తెలిపారు  ఈ వెబ్‌సీరిస్‌కు మ్యూజిక్‌: అజయ్‌ అరసాడ, సినిమాటోగ్రఫీ: రాకేష్‌ ఎస్‌ నారాయణ, ఎడిటర్‌: వెంకటకృష్ణ చిక్కాల, కథ-మాటలు: అర్జున్‌-కార్తీక్‌.

Lol Salam Trailer released by Nani:

Lol Salam web series Trailer released by Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ