హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం సెహరి. జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో బాలకృష్ణగారి స్పీచ్ హైలైట్‌గా నిలవడంతో పాటు సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే..
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలైపోయాయి. ప్రశాంత్ ఆర్ విహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను లాంచ్ చేశారు మేకర్స్. కచడ కచడ హో గయా.... అర్థమైత లేదయా, అచట ముచట లేదయా... అంటూ మొదలైయ్యే ఈ పాట ఇక లైట్ లేలోరే! మాస్ స్టెప్పు వేయ్ రే..నేను ఆడాలన్నా..పాడాలన్నా జిందగీలో లేదే సెహరి...చిల్ అవ్వాలన్నా లవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి..సెహరి అంటూ సాగుతుంది. సోమవారం విడుదలైన ఈ క్యాచీ సాంగ్ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ సెహరి టైటిల్ సాంగ్‌లో హర్ష్ డ్యాన్సింగ్ స్కిల్స్ అదిరిపోయాయి. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియో గ్రఫీ చేశారు. హిట్ ఫిల్మ్ జాతిరత్నాలు సినిమాలోని చిట్టి నీ నవ్వంటే.. అనే సాంగ్ పాడిన చౌరస్తా బ్యాండ్ ఫేమ్ రామ్ మిరియాల జిందగీలో లేదే సెహరి..సెహరి పాటను పాడారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్ అందించారు.