Advertisementt

శోభన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం!

Sun 06th Jun 2021 07:12 PM
shobhan hero movie,shobhan hero movie starts,pro sai satesh,pro parvathaneni rambabu  శోభన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం!
Shobhan hero new movie starts శోభన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం!
Advertisement
Ads by CJ

శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్ గోపిల చిత్రం ప్రారంభం !

శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్, చంద్ర వట్టికూటి, మోహన్, మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా గురించి దర్శకులు వివరాలు తెలియచేస్తూ.. మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. మేము ఇదివరకే హీరో తరుణ్ తో ఇది నా లవ్ స్టోరీ, ఆ తరువాత రెడ్డి గారింట్లో రౌడీయిజం తీసాము, అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేసాము, అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఇది మా నాలుగో సినిమా.  ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూన్నాం, తాను ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా లవ్, సస్పెన్సు ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే.. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీనటుల టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిచేస్తాం. అన్నారు.

దర్శకత్వం: రమేష్ గోపి, బ్యానర్: ఎస్పీ క్రియేషన్స్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Shobhan hero new movie starts:

Shobhan hero movie starts!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ