Advertisementt

ఏక్ మినీ కథ నుండి ప్రేమ్ కుమార్ గా

Fri 04th Jun 2021 05:47 PM
santosh shobhan,hilarious entertainer,prem kumar movie  ఏక్ మినీ కథ నుండి ప్రేమ్ కుమార్ గా
Santosh Shobhan hilarious entertainer Prem Kumar ఏక్ మినీ కథ నుండి ప్రేమ్ కుమార్ గా
Advertisement
Ads by CJ

సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ప్రేమ్ కుమార్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు ఇతర తారాగణం. ఆల్రెడీ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత మిగతా భాగం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టైటిల్ వెల్లడించారు.  

దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ "సాధారణంగా తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్‌లు ఇచ్చి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, అదే పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికొడుకును మాత్రం ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేశాడనేది సినిమా కథ. అందర్నీ నవ్విస్తుందీ సినిమా" అని అన్నారు.

నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ "హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. సంతోష్ శోభన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఆల్రెడీ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత మిగతా చిత్రీకరణ పూర్తి చేసి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి విడుదల తేది ప్రకటిస్తాం" అని అన్నారు.  

Santosh Shobhan hilarious entertainer Prem Kumar:

Santosh Shobhan hilarious entertainer Prem Kumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ