Advertisementt

బాలుకు అసలైన నివాళి

Fri 04th Jun 2021 01:11 PM
sp balu,katragadda prasad,tribute to sp balu,june 4th sp balu birthday,sp balu  బాలుకు అసలైన నివాళి
An original tribute to SP Balu -Katragadda Prasad బాలుకు అసలైన నివాళి
Advertisement
Ads by CJ

అప్పుడే బాలుకు అసలైన నివాళి - కాట్రగడ్డ ప్రసాద్

తెలుగు వారంతా గర్వించతగ్గ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సంగీత ప్రపంచంలో  ఎప్పటికీ చెరిగిపోని కీర్తి పతాక  మన బాల సుబ్రహ్మణ్యం. ఈరోజు బాలుగారి  75వ పుట్టినరోజు. ఆయన  భౌతికంగా మన మధ్యన  లేరు కానీ ఆయన పాట, ఆయన మాట  మనతోనే వున్నాయి. మన మనసులో పల్లవిస్త్తూనే వున్నాయి.  గత సంవత్సరం సెప్టెంబర్ 25 సినిమా ప్రపంచంలో చీకటి రోజు. కరోనా అనే మహమ్మారి బాలు గారిని మనకు దూరం చేసింది. ఎవరూ ఊహించ లేదు బాలు గారు మన మధ్యనుంచి వెళ్ళిపోతారని. తెలుగు సినిమా నివ్వెరపోయింది. తెలుగువారంతా తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు విషాదంలో మునిగిపోయారు. సంగీత ప్రపంచం మౌనంగా రోదించింది.

బాలు గారు  సాధించిన విజయాలను చరిత్రగా మనకు అప్పగించి వెళ్లిపోయారు. బాలు గారిని  1966లో శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడుగా పద్మనాభం గారు పరిచయం చేశారు . అక్కడ నుంచి బాలు గారు చనిపోయేంత వరకు సినిమాలో, టీవీ లో తన గళం వినిపిస్తతోనే వున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 40,000 పాటలను గానం చేశారు. 6 జాతీయ అవార్డులు, 6 ఫిలిమ్ ఫేర్ అవార్డులు, 24 ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులు, 4 కర్ణాటక రాష్ట్ర అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు, లెక్కలేనన్ని ప్రైవేట్ అవార్డులు, సన్మానాలు, సత్కారాలు, డాక్టరేట్ గౌరవాలు బాలు కీర్తి కిరీటంలో  ఒదిగి పోయాయి. భారత ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2021లో పద్మవిభూషణ్ అత్యున్నత పురస్కారాలు వరించాయి. బాలు గారు గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, నటుడుగా బహు ముఖాలుగా ఎదిగారు, అయినా ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని అతున్నంత పురస్కారాలు వచ్చినా వినమ్రంగా  ఒదిగి వున్న మహా కళాకారుడు, మానవతా మూర్తి , అందరికీ అత్యంత ఆప్తులు బాలు గారు.

బాలు గారితో నాకు మూడు దశాబ్దాల అనుబంధం. నేను నిర్మించిన 17 సినిమాల్లో 87 పాటలను గానం చేశారు. ఆయన నన్ను చాలా ఆత్మీయుడుగా చూసేవారు. బాలు గారు కరోనాతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి వారి కుమారుడు చరణ్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని, గత సంవత్సరం సెప్టెంబర్ 25న బాలు గారు ఇక లేరు అన్న వార్త కలవరపెట్టింది, కన్నీరు పెట్టించింది. అయితే తెలుగు సినిమా కీర్తిని తన పాటతో విశ్వ వ్యాప్తం చేసిన బాలు గారిని కడసారి చూడటానికి హైదరాబాద్ నుంచి ప్రముఖులు ఎవరూ రాకపోవం నన్ను అమితంగా  బాధించింది. ఒక మహా గాయకునికి ఇచ్చే నివాళి ఇదా అనిపించింది. అయినా బయట ప్రపంచంలో బాలు సంగీతాభిమానులు కోట్లలో వున్నారు, పాడుతా తీయగా, స్వరాభిషేకం తో వేలాది మంది గాయని గాయకులకు మార్గదిర్ధేశనం చేశారు. తన సంగీత వారసులను తయారు చేసి మరీ వెళ్లిపోయారు. సంగీతానికి బాలు గారు చేసిన కృషీ, ఆయన పంచిన మధుర గీతాలు ఎప్పటికీ మనకి స్ఫూర్తి నిస్తూనే ఉంటాయి . ఆయన మనకెంతో చేశారు. మరి మనం ఆయన స్మృతి చిహ్నంగా ఏదైనా చెయ్యాలి కదా!

బాలుగారి పేరుతో ఒక సంగీత విశ్వ విద్యాలయంకు ఆయన జన్మించిన నెల్లూరులో అంకుర్పాణ జరిగింది. ఆది త్వరలో పూర్తి కావాలి. అలాగే ఆ మహా గాయకుడుకు భారత రత్న వచ్చేంతవరకు మనం విశ్రమించకూడదు. ఈ రెండు సాకారమైన  రోజే బాలు గారికి నిజమైన నివాళి.

- కాట్రగడ్డ ప్రసాద్.

(దక్షణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు).

Click Here Video: Katragadda Prasad Tribute to SP Balu

An original tribute to SP Balu -Katragadda Prasad:

June 4th Sp Balu Barthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ