టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి విశ్వక్ సేన్ యువతను ఆకర్షించే చిత్రాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పాగల్‌కి కూడా యూత్‌లో మంచి బజ్ ఏర్పడింది. ఈ రోజు పాగల్ చిత్రం నుండి ఈ సింగిల్ చిన్నోడే.. పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సింగల్ చిన్నోడే..న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే..సిగ్నల్ గ్రీనే చూశాడే పరుగులు పెట్టాడే అంటూ సాగే ఈ పాట సాహిత్యానికి తగ్గట్టుగా హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. అతను ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట అని తెలుస్తోంది.
ఈ సాంగ్‌లో సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఈ పెప్పీ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ స్వరపరచగా బెన్నీ దయాల్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఆలపించారు. కృష్ణ కాంత్ సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో విశ్వక్ సేన్ మొదటిసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ప్రదర్శించాడు.