Advertisementt

ఫ‌న్‌రైడ‌ర్‌గాముగ్గురు మొనగాళ్లు ట్రైల‌ర్

Tue 25th May 2021 01:14 PM
mugguru monagallu movie,mugguru monagallu trailer,mugguru monagallu trailer review  ఫ‌న్‌రైడ‌ర్‌గాముగ్గురు మొనగాళ్లు ట్రైల‌ర్
Mugguru Monagallu Trailer released ఫ‌న్‌రైడ‌ర్‌గాముగ్గురు మొనగాళ్లు ట్రైల‌ర్
Advertisement
Ads by CJ

శ్రీ‌నివాస్‌రెడ్డి, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ దియా ఫేమ్‌), వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ముగ్గురు మొనగాళ్లు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ  రోజు ముగ్గురు మొన‌గాళ్లు ట్రైల‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

2.15నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం న‌వ్వులు పూయించింది. శ్రీనివాసరెడ్డికి విన‌ప‌డ‌దు, దీక్షిత్‌ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ట్రైల‌ర్‌లో వీరు ముగ్గురు క‌లిసి చేసే అల్ల‌రి క‌డుపు చ‌క్క‌లయ్యేలా న‌వ్వించింది. ఇక అనుకోకుండా వ‌రుస హత్య‌ల‌కేసులో వీరు ముగ్గురు ఇరుక్కోవ‌డం త‌ర్వాత ఆ కేసుని వీళ్లు ఛేదించాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం లాంటి అంశాలు థ్రిల్లింగ్‌గా ఉండ‌డంతో పాటు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాయి. గ‌రుడ‌వేగ అంజి విజువ‌ల్స్‌, సురేష్ బొబ్బిలి సంగీతం, చిన్న  నేపేథ్య సంగీతం ట్రైల‌ర్‌ను మ‌రో రెంజ్‌కి తీసుకెళ్లాయి. మొత్తానికి ఈ ట్రైల‌ర్‌తో  సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ముగ్గురు మొనగాళ్లు సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Mugguru Monagallu Trailer released :

Mugguru Monagallu Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ