Advertisementt

ద‌ర్శ‌కేంద్రుడి బర్త్ డే స్పెషల్

Sun 23rd May 2021 02:35 PM
pelli sandad,second song,bujjulu bujjulu,director raghavendra rao,birthday special  ద‌ర్శ‌కేంద్రుడి బర్త్ డే స్పెషల్
Director Raghavendra Rao Birthday Special ద‌ర్శ‌కేంద్రుడి బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు సందర్భంగా పెళ్లిసంద‌D నుంచి బుజ్జులు బుజ్జులు..  పాట విడుదల

కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టిన‌రోజు నేడు(మే23). ఈ  రోజున ద‌ర్శ‌కేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌పెళ్లి సంద‌D చిత్రంలోని రెండ‌వ‌పాట బుజ్జులు బుజ్జులు... ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం పెళ్లిసంద‌D. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 

పాలకుండ నెత్తినెట్టి పంజగుట్ట పోతవుంటే

బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు

రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు

కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు

చిల్లుపడ్డ కుండతో ఇంటికెట్ట పోనురా పోరడా..నీ మద కోపమొచ్చెరా

నీ బుంగ మూతి చూడనేకి రాయి పెట్టి కొట్టినా

కంటి ఎరుపు సూడనేకి కుండ పగల గొట్టినా

అలక నీది సూడనేకి అల్లరెంతో జేసినా

బుజ్జులు బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు..

పాట వింటే ప్రేయసి ప్రేమికుడు ఏడిపించడం..మళ్లీ ఆమె అలక తీర్చడానికి ఆమెకు ఇష్టమైనవన్నీ కొని పెడతానని అనడం.. పాట ఇలా సాగుతుంది. 

 ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ - శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుగారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నేను డైరెక్ట్ చేస్తోన్నపెళ్లిసంద‌D  సినిమా నుంచి బుజ్జులు పాట‌ను ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట‌ర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వ‌స్తోంది. అలాగే రాఘ‌వేంద్ర‌రావుగారు మ‌రియు కీర‌వాణిగారి సూప‌ర్ హిట్ కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఇటీవల విడుదలై మెప్పించిన తొలిసాంగ్‌లాగానే బుజ్జులు సాంగ్ కూడా మెప్పిస్తుంది. అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా పాటను అభిమానులకు అందించడ హ్యపీ. రాఘవేంద్రరావు, కీరవాణి కాంబోలో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అదే కోవలో ఇది కూడా నిలుస్తుంది. సినిమా విషయానికి వస్తే..ఏడు రోజులు ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి జూన్‌, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం అన్నారు.

Director Raghavendra Rao Birthday Special:

Pelli SandaD Second Song Bujjulu Bujjulu Launch on Director Raghavendra Rao Birthday!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ