కరోనా కారణంగా బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు.. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. సెకండ్ వేవ్ మొదలు కాగానే థియేటర్స్ మూసేసారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే చాల సినిమాలు వాయిదా వేసేసారు. అందులో మా సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ ఈమధ్య అధికారికంగా ప్రకటించారు ఏక్ మినీ కథ చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యానర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది.
ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు.