Advertisementt

కమెడియన్ సుధీర్ 'గాలోడు' లుక్

Wed 19th May 2021 05:36 PM
sudigali sudheer,sudheer birthday,first look,gaalodu look  కమెడియన్ సుధీర్ 'గాలోడు' లుక్
The First Look Motion Poster Of Gaalodu Unveiled కమెడియన్ సుధీర్ 'గాలోడు' లుక్
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ హీరోగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సూప‌ర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంభినేష‌న్‌లో ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ప్రారంభ‌మైంది. మే19 హీరో సుడిగాలి సుధీర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి గాలోడు అనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. క్యాచీ టైటిల్‌తో పాటు ఇన్నోవేటివ్‌గా ఉన్న ఈ మోష‌న్‌పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంస్కృతి ఫిలింస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనున్నారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ - మాస్‌లో సుడిగాలి సుధీర్‌కి ఎంత ఇమేజ్ ఉందో చెప్ప‌డానికి  మా సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రానికి వ‌చ్చిన భారీ ఓపెనింగ్స్ నిద‌ర్శ‌నం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్నిభారీ ఎత్తున రూపొందిస్తున్నాం. ఈ రోజు సుధీర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గాలోడు అనే టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం అన్నారు.  

The First Look Motion Poster Of Gaalodu Unveiled:

On The Occasion Of Sudigali Sudheer Birthday, The First Look Motion Poster Of Gaalodu Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ