భారత దేశంలో ఓటీటీ రంగంలో ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు అడుగుపెట్టాయి. ఆ సంస్థలన్నింటి ఆధిపత్యానికి సవాల్ విసురుతూ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సారగ్ మాచనూరు స్పార్క్ ఓటీటీ (Spark OTT) పేరిట తన సొంత ఓటీటీ వేదికను రంగంలోకి దించుతున్నారు. తనదైన శైలి ప్రమోషన్ తో ఇటీవలి కాలంలో స్పార్క్ ఓటీటీ అందరికీ అమితాసక్తి రేకెత్తించింది.
ఈ నెల 15న (నేటి అర్థరాత్రి) స్పార్క్ ఓటీటీ గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ సందర్భంగా సాగర్ మాచనూరు మాట్లాడుతూ ప్రమోషన్ లో చూపించిన దానికంటే కూడా మెరుగైన కథా కథనాలతో ఒరిజినల్ సిరీస్ లతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం మరియు హిందీ భాషల్లో జనాదరణ పొందిన సినిమాలను తమ వేదికలో ప్రసారం చేస్తామని చెప్పారు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం డీ కంపెనీ తమ ఓటీటీ వేదికపై ప్రదర్శితం కానున్న తొలి చిత్రమని చెప్పారు.
సాగర్ మాచనూరు ఉత్సాహం, స్పార్క్ ఓటీటీ ఆశయాలను చూసి ముగ్ధలైన రాంగోపాల్ వర్మ.. స్పార్క్ ఓటీటీ కోసమే ప్రత్యేకంగా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఇక స్పార్క్ ఓటీటీ (OTT Platform) వేదికపై ప్రసారం కానున్న ఇతర ఆసక్తికర వెబ్ సిరీస్ లు, చిత్రాల విషయానికి వస్తే.. దిశ ఎన్‌కౌంటర్, సునీల్ రూపొందించిన కనబడుట లేదు, క్యాబ్ స్టోరీస్, వర్మ రూపొందించిన ఇది మహాభారతం కాదు, భారత్ లో తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ గా రూపొందిన డేంజరస్, ట్యాబ్లెట్, రామూఇజమ్ విత్ స్వప్న తదితరాలున్నాయి.
స్పార్క్ ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
Press release by: Indian Clicks, LLC