Advertisementt

డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు లాక్‌డౌన్ స్పెషల్ ర్యాప్

Wed 12th May 2021 08:15 PM
www movie,lockdown song,www  డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు లాక్‌డౌన్ స్పెషల్ ర్యాప్
Who.. Where.. Why Lockdown Song From WWW Is Out Now డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు లాక్‌డౌన్ స్పెషల్ ర్యాప్
Advertisement
Ads by CJ

118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అదిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌తో ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ త‌రుణంలో అందరిలో చిన్న పాటి ధైర్యాన్ని తీసుకు రావ‌డానికి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు యూనిట్ లాక్‌డౌన్ ర్యాప్ వీడియో సాంగ్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది.  సైమన్ కె.కింగ్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో హు వేర్ వై.. అంటూ హుశారుగా సాగే ఈ పాట‌ను  రోల్ రైడా పాడారు. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ  - డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు).. సినిమా ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే ఇది ఒక డిఫ‌రెంట్ మూవీగా నిలుస్తుంది అన్నారు.

చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల  మాట్లాడుతూ -ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కొవిడ్ బారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌ను ఈ పాట‌లో చిత్ర యూనిట్ అభినందించేలా, అంద‌రూ మాస్కులు ధ‌రించి, శానిటైజ‌ర్స్‌ను ఉప‌యోగిస్తూ సామాజిక దూరాన్ని పాటించాల‌ని తెలియ‌జేసేలా ఈ పాటను రూపొందించ‌డం జ‌రిగింది అన్నారు.

Who.. Where.. Why Lockdown Song From WWW Is Out Now:

Lockdown Song From WWW Is Out Now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ