Advertisementt

పూజారి పాత్రలో ఆదిత్య ఓం.!

Fri 07th May 2021 08:50 AM
dhahanam movie,aditya om,dahanam movie,dhahnam movie  పూజారి పాత్రలో ఆదిత్య ఓం.!
Aditya Om Plays A Temple Priest In Dahnam పూజారి పాత్రలో ఆదిత్య ఓం.!
Advertisement
Ads by CJ

పూజారి పాత్రలో నటిస్తున్న ఆదిత్య ఓం.!

వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న ఆదిత్య ఓం హీరో గా నటిస్తున్న సరికొత్త చిత్రం దహనం.. కొందరు శక్తివంతమైన బిజినెస్ మెన్ ల నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమా లో ఆదిత్య ఓం.. 1980వ కాలం లో సాగే ఈ సినిమా లో ఆదిత్య పూర్తిగా అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు.. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశారు.. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయి లు ఈ సినిమా ను సంయుక్తంగా నిర్మిస్తుండగా ఎడారి మూర్తి సాయి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. డాక్టర్ పి సతీష్ కుమార్ బాణీలను సమకూరుస్తున్నారు.. ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుపుకుంది.. కె.విశ్వనాథ్, బాపు గారి సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమా లో ఉండబోతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు చిత్ర నిర్మాతలు..

నటీనటులు : ఆదిత్య ఓం, ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్ర. బ్యానర్: ఓపెన్ ఫీల్డ్ మీడియా, సంగీతం: డాక్టర్ పి సతీష్ కుమార్, దర్శకుడు: ఎడారి మూర్తి సాయి, నిర్మాతలు: డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయి.

Aditya Om Plays A Temple Priest In Dahnam:

Aditya Om in the role of a priest!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ