Advertisementt

సీటీమార్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు

Sun 25th Apr 2021 04:39 PM
rockstar,devi sri prasad,sensation,seetimaarr song,salman khan,prabhu deva,raadhe  సీటీమార్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు
Devi Sri Prasad Is All Set To Create Sensation With Seetimaarr Song సీటీమార్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాధించిన విజ‌యాలు అంద‌రికీ తెలిసిందే.. జాతీయ‌స్థాయిలో బెస్ట్ పాపుల‌ర్ ఫిలిం అవార్డ్ అందుకున్నమ‌హ‌ర్షి చిత్రానికి త‌న మ్యూజిక్‌తో ప్రాణం పోశారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. అలాగే క‌రోనా క్రైసిస్‌లో కూడా జ‌నం ఉప్పెన‌లా థియేట‌ర్ల‌కు త‌ర‌లిరావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉప్పెన చిత్రానికి  దేవిశ్రీ అందించిన పాట‌లే. రానున్న పాన్ఇండియా మూవీ పుష్పకి హై ఎక్స్‌పెక్టేష‌న్స్ రావ‌డానికి రాక్‌స్టార్ కూడా ఒక కార‌ణం. అలాగే రామ్ లింగుసామి కాంభినేష‌న్ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్‌ ఎంట్రీతో ఒక కొత్త ఊపువ‌చ్చింది. వీటితోపాటు ఎఫ్‌3, ఖిలాడి సినిమాల‌కి దేవిశ్రీ సంగీతం మంచి ఎసెట్ కానుంది. ఇటు త‌మిళ్‌లో అంద‌రిహీరోల‌తో అద్భుత‌మైన హిట్స్ ఇవ్వ‌డ‌మే కాకుండా జీత‌మిళ్‌లో ప్ర‌సారం అవుతున్న రాక్‌స్టార్ షోతో త‌మిళ‌నాట త‌న ఇమేజ్‌ని మ‌రింత రెట్టింపు చేసుకున్నారు దేవి. 

తాజాగా స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ప్ర‌భుదేవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రాధే చిత్రానికి సీటీమార్‌ సాంగ్‌తో దేశ‌మంతా చెప్పు‌కునేలా స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. దేవి కంపోజ్‌ చేసిన సీటీమార్ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే.. ఈ పాట ఎంతో న‌చ్చ‌డంతో త‌న రాధే సినిమాలో ఈ పాట‌ను మ‌ళ్లీ చేయ‌మ‌ని స‌ల్మాన్ ఖాన్ ప‌ర్స‌న‌ల్‌గా అడగ‌డం విశేషం. మే13న విడుద‌ల‌వుతున్న స‌ల్మాన్‌ఖాన్ రాధేలో దేవిశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచిన‌ సీటీమార్ సాంగ్ ఒక స్పెష‌ల్ హైలెట్ కాబోతుంది. ఈ సినిమా త‌ర్వాత బాలీవుడ్‌లో రెండు ప్ర‌స్టీజియ‌స్ మూవీస్‌కి దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సైన్ చేశారు. సీటీమార్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సాంగ్‌తో స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌శంస‌లందుకున్న రాక్‌స్టార్ రానున్న కాలంలో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్‌లో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

Devi Sri Prasad Is All Set To Create Sensation With Seetimaarr Song :

Rockstar Devi Sri Prasad Is All Set To Create Sensation With Seetimaarr Song From Salman Khan Raadhe

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ