Advertisementt

ఆది సాయి కుమార్ అమరన్‌ లాంచ్

Sat 24th Apr 2021 10:09 PM
aadi sai kumar amaran movie opening,aadi sai kumar amaran movie,amaran movie launch,aadi sai kumar,sai kumar,veerabhadram chowdary,avika goer,aadi sai kumar - veera bahdram chowdary combo movie  ఆది సాయి కుమార్ అమరన్‌ లాంచ్
Aadi Sai Kumar Amaran Movie Launch ఆది సాయి కుమార్ అమరన్‌ లాంచ్
Advertisement
Ads by CJ

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఆదిసాయికుమార్ హీరోగా అవికాగోర్ హీరోయిన్ గా ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్ చిత్రం అమరన్‌  ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 ప్రారంభం

వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్‌.వీ.ఆర్‌  ప్రొడక్షన్‌ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1. అవికా గోర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్‌.బల‌వీర్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌.వీ.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర‌భ‌ద్రం చౌద‌రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఇన్నోవేటివ్‌, యూనిక్‌ పాయింట్‌తో అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 సినిమా రూపొందుతుంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్‌ టచ్‌ కూడా ఉంటుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత‌లు. అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోతున్న  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్‌ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్‌ చేసే కథాంశంతో థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర్‌ శంకర్‌, పవిత్రా లోకేశ్‌, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

నటీనటులు:

ఆది సాయికుమార్‌, అవికాగోర్‌, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర్‌ శంకర్, పవిత్రా లోకేశ్‌, మధు మణి తదితరులు

Aadi Sai Kumar Amaran Movie Launch:

Aadi Sai Kumar - VeeraBhadram Chowdary Amaran Movie Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ