Advertisementt

అవసరాల మోసం చేశాడని.. పాట

Mon 10th May 2021 01:11 PM
nootokka jillala andagadu,manasa vinava,avasarala srinivas,ruhani sharma,lyrical song  అవసరాల మోసం చేశాడని.. పాట
Heartful Melody Manasa Vinava From Nootokka Jillala Andagadu అవసరాల మోసం చేశాడని.. పాట
Advertisement
Ads by CJ

ప్రేమ‌లో నిజాయితీ ఉండాల‌నుకునే అమ్మాయి... దొర‌క్క దొరికిన ప్రేమ‌ను, ప్రేయ‌సిని వ‌దులుకోకూడ‌ద‌నుకునే యువ‌కుడు కొన్ని నిజాల‌ను దాస్తాడు. కానీ నిజం ఎప్ప‌టికైనా బ‌య‌ట ప‌డాల్సిందే. అలాంటి నిజం బ‌య‌ట‌ప‌డితే వారి ప్రేమ‌లో ఎలాంటి ప‌రీక్ష‌లు ఎదుర‌వుతాయి. ప్రేమికుడు, ప్రేయ‌సి మ‌ధ్య ఊసులు క‌రువై.. ఊహ‌లే ఊసులైన వేళ ఎలా ఉంటుంది.. ఆ ఊసులు పాట‌లుగా మారుతాయి. త‌న ప్రేమ‌లో నిజాయితీ ఉంద‌ని, తాను ఊర‌క‌నే మోసం చేయ‌లేద‌ని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్ట‌డం త‌ప్పు అని ప్రేయ‌సి పాడుకునే పాట ఎలా ఉంటుందో తెలుసా.. ‘మనసా వినవా..’లా ఉంటుందని అంటున్నారు లిరిసిస్ట్ భాస్కర భట్ల. 

 

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల  శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఎంట‌ర్‌టైన‌ర్  ‘101 జిల్లాల అంద‌గాడు’ . బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ చిత్రంలో ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. 

 

శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నఈ సినిమా నుంచి ‘మనసా వినవా..’ సాంగ్‌ను చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ పాట‌కు భాస్క‌ర భ‌ట్ల సాహిత్యాన్ని అందించ‌గా, శ్రీరామ‌చంద్ర‌, ధ‌న్య‌బాల‌కృష్ణ పాట‌ను ఆల‌పించారు. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్  ‘101 జిల్లాల‌ అంద‌గాడు’  చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు  ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. 

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Heartful Melody Manasa Vinava From Nootokka Jillala Andagadu:

Nootokka Jillala Andagadu Movie Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ