Advertisementt

‘గుండె క‌థ వింటారా’.. సోల్‌ఫుల్ మెలొడీ

Sun 09th May 2021 05:20 PM
gunde katha vintara,madhu nandan,melody song,gunde katha vintara movie  ‘గుండె క‌థ వింటారా’.. సోల్‌ఫుల్ మెలొడీ
Entha Baavundo Lyrical Video from Gunde Katha Vintara ‘గుండె క‌థ వింటారా’.. సోల్‌ఫుల్ మెలొడీ
Advertisement
Ads by CJ

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై  క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌ల‌తో ‘ఎంత బావుందో...‌’ లిరిక‌ల్ సాంగ్‌ని విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

 

‘ఎంత బావుందో.. ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా...గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది’ అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి  మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య  సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ‌

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Entha Baavundo Lyrical Video from Gunde Katha Vintara:

Gunde Katha Vintara Melody song released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ