Advertisementt

గల్లీ రౌడీ: రౌడీయిజంలో నెపోటిజమా !.

Mon 19th Apr 2021 06:07 PM
vijay deverakonda,sundeep kishan,gully rowdy teaser,gully rowdy teaser review,kona venket  గల్లీ రౌడీ: రౌడీయిజంలో నెపోటిజమా !.
Gully Rowdy teaser released గల్లీ రౌడీ: రౌడీయిజంలో నెపోటిజమా !.
Advertisement
Ads by CJ

బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారా? 

రెండు కోట్ల రూపాయ‌ల డ‌బ్బు కోసం ఓ ఫ్యామిలీ కిడ్నాప్ చేయాల‌నుకుంటుంది. అందుకోసం ఆ ఫ్యామిలీ విశాఖ‌ప‌ట్నంలోని ఓ కుర్ర రౌడీ క‌లిస్తే ..ఏమ‌వుతుంది?

ఎవ‌రన్నా వాడి మ‌న‌వ‌డ్ని ఇంజ‌నీర్‌ని చేస్తాడు, డాక్ట‌ర్ చేస్తాడు. బాగా బ‌లిసికొట్టుకుంటే ఎమ్మెల్యేని చేస్తాడు.. కానీ ఓ తాత త‌న మ‌న‌వ‌డిని రౌడీని చేయ‌మేంటి?

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే గల్లీ రౌడీ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్ రెడ్డి, చిత్ర స‌మ‌ర్ప‌కుడు, రైట‌ర్ కోన వెంక‌ట్, నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో, పాత్ర‌ల్లో న‌టిస్తున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం గల్లీ రౌడీ. గల్లీ రౌడీ టీజర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

టీజర్ చాలా ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అసలు గల్లీ రౌడీ కథాంశం ఏంటి... ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఈ టీజర్‌లో రివీల్ చేశారు.రైట‌ర్ కోనవెంక‌ట్ క‌థ‌ను ఫ‌న్ రైడ‌ర్‌గా క‌థ‌ను మ‌లిచిన విధాం,  సందీప్ కిషన్ తనదైన డిఫరెంట్ రోల్‌లో నటించారని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి, మరోసారి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు.  కామెడీ కింగ్, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకులకు నవ్వులను పంచబోతున్నారు. 

Gully Rowdy teaser released :

Vijay Deverakonda released Sundeep Kishan Gully Rowdy teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ