Advertisementt

హీరోగా పరిచయమవుతున్న శివాoశు

Thu 15th Apr 2021 06:07 PM
introducing,shivashu,hero,rvg production-3  హీరోగా పరిచయమవుతున్న శివాoశు
Introducing Shivashu as a hero హీరోగా పరిచయమవుతున్న శివాoశు
Advertisement
Ads by CJ

కత్తిలాంటి కొత్త కుర్రాడు శివాoశును హీరోగా పరిచయం చేస్తూ.. ఆర్.వి.జీ మూవీజ్-ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైద్రాబాద్, సత్యసాయి నిగమాగమంలోని వినాయకుని గుడిలో మొదలైంది. రవిశంకర్ ఓంకాలి-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహిస్తున్నారు. శివాoశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

 దైవ సన్నిధిలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి.. ఈ చిత్రానికి మాటలు-పాటలు రాస్తున్న ప్రముఖ రచయిత వి.ఎస్.పి.తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా... శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు. 

పూజా కార్యక్రమాలు అనంతరం రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో.. దర్శకుడు రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), రచయిత వి.ఎస్.పి.తెన్నేటి, హీరో శివాoశు, హీరోయిన్ ప్రాచీ రాయ్, నిర్మాతలు రవిశంకర్ ఓంకాలి- తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంగీత దర్శకుడు రాజేష్ రాజ్.టి, కెమెరామెన్ ప్రసాద్ కె.నాయుడు, ఈ చిత్రంలో కీలక పాత్రధారి ఆకెళ్ల పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. 

 దర్శకనిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ... నా ప్రతి సినిమాలోనూ కొత్తవారిని పరిచయం చేసే నేను.. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో... అత్యంత ప్రతిభతోపాటు మంచి ఫైర్ ఉన్న కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నాను అన్నారు!!

Introducing Shivashu as a hero :

Introducing Shivashu as a hero RVG Production-3 Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ