క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, రాక్షసుడు వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌పోస్టర్, మాస్ మహారాజ్ రవితేజ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ సాధించడంతో సినిమా భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌లో రవితేజను చాలా పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు దర్శకుడు రమేష్ వర్మ. చేతిలో సుత్తి పట్టుకుని కంటైనర్ బాక్సుల నడుమ రవితేజ స్టైలిష్‌గా నడుస్తున్న లుక్ చూసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. వారి అంచనాలకు ధీటుగా హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎలివేటెడ్ లొకేషన్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవల ఇటలీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్‌కొరియోగ్రఫి చేస్తుండడం విశేషం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖిలాడి టీజర్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్12, ఉదయం 10.08నిమిషాలకు విడుదలచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవల ఇటలీలో షూటింగ్ కి సంబందించి టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.