Advertisementt

వెంకయ్య నాయుడు గారికి భారతమెరికా పుస్తకం

Fri 02nd Apr 2021 05:54 PM
bharathamerica book,bharathamerica book for venkaiah naidu,bvhagiradha book  వెంకయ్య నాయుడు గారికి భారతమెరికా పుస్తకం
BharathAmerica book for Venkaiah Naidu వెంకయ్య నాయుడు గారికి భారతమెరికా పుస్తకం
Advertisement
Ads by CJ

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి భారతమెరికా

జర్నలిస్ట్, రచయిత  భగీరథ రచించిన  భారతమెరికా పుస్తకాన్ని శుక్రవారం రోజు  ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు గారికి బహుకరించారు. ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు గారిని  హైదరాబాద్ నివాసంలో కలసి తన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి కి బహుకరించానని, ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని  భగీరథ తెలిపారు.

తాను 2014లో అమెరికా దేశాన్ని సందర్శించానని, ఆ పర్యటన వివరాలతో  పాటు  12వ శతాబ్దము నుంచి భారత దేశ చరిత్రను  క్రోనాలాజికల్ ఆర్డర్ లో వ్రాయడం జరిగిందని, అలాగే నన్నయ్య యుగం  నుంచి తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని  కూడా  ఇందులో పొందుపరచడం జరిగిందని ఉప రాష్ట్రపతి గారికి వివరించినట్టు  భగీరథ చెప్పారు.  అలాగా, వీలున్నప్పుడు తప్పకుండా భారతమెరికా చదువుతానని వెంకయ్య నాయుడు గారు చెప్పారని భగీరథ తెలిపారు.

ఒక మంచి పుస్తకాన్ని బహుకరించినందుకు భగీరధను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అభినందించారు.

BharathAmerica book for Venkaiah Naidu:

BharathAmerica book for Venkaiah Naidu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ