Advertisementt

బ్యాచ్ ల‌ర్ ఏ జింద‌గీ సాంగ్ లుక్

Fri 02nd Apr 2021 03:41 PM
most eligible bachelor movie,akhil akkineni,pooja hegde,ye zindagi song,5th april release  బ్యాచ్ ల‌ర్ ఏ జింద‌గీ సాంగ్ లుక్
Most Eligible Bachelor Ye Zindagi song on 5th April బ్యాచ్ ల‌ర్ ఏ జింద‌గీ సాంగ్ లుక్
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 5న అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్, జిఏ 2 పిక్చర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఏ జిందగీ పాట‌ విడుదల..

స‌బ్ హెడ్డింగ్ - అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఏ జింద‌గీ సాంగ్ లుక్ పోస్టర్ విడుద‌ల‌ 

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా మరో సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాట ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ పాటకు సంబంధించిన లుక్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది, పాట టైటిల్ కి త‌గ్గ‌ట్లుగా ఏ జింద‌గీ అంటూ సైకిల్ మీద అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే వెళ్తున్న స్టిల్ తో ఈ పోస్ట‌ర్ ని రెడీ చేశారు ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు. 

Most Eligible Bachelor Ye Zindagi song on 5th April:

Most Eligible Bachelor Ye Zindagi song on 5th April release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ