Advertisementt

రాజశేఖర్ మర్మాణువు లుక్

Thu 25th Mar 2021 06:47 PM
dr. rajasekhar,marmaanuvu movie,director venkatesh maha,venkatesh maha birthday special  రాజశేఖర్ మర్మాణువు లుక్
Dr.Rajasekhar Marmaanuvu announced రాజశేఖర్ మర్మాణువు లుక్
Advertisement
Ads by CJ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. దీనికి కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకుడు. విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మించనున్నారు.

దర్శకుడు వెంకటేష్ మహా (మార్చి 25 - గురువారం) పుట్టినరోజు సందర్భంగా... గురువారం సినిమా ప్రకటించడంతో పాటు చిత్రానికి మర్మాణువు టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాతలు తెలియజేశారు. వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం" అని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి చెప్పారు.

Dr.Rajasekhar Marmaanuvu announced:

Dr.Rajasekhar Marmaanuvu with director Venkatesh Maha announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ