యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం లక్ష్య. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో సర్పైజ్ చేశారు నాగశౌర్య. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి, నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ప్రాచీన కాలంలో ఆర్చరీని వేట మరియు పోరాటాల కోసం ఉపయోగించేవారు. అనేక పౌరాణిక కథలలో దాని ఉనికిని మరచిపోలేము. గొప్ప యోధులుగా, దేవుడిగా వ్యవహరించే వ్యక్తులు ఎల్లప్పుడూ విల్లుని ధరించే కనిపిస్తారు. ఇప్పుడు ఆ క్రీడ వెండితెరపైకి రాబోతుంది. విలువిద్య ఆధారంగా భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్రం త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.
1900లో సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆర్చరీని క్రీడగా చేర్చారు అప్పటి నుండి ఇది క్రీడా సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ ఆటకు తీక్షణమైన దృష్టి, క్రమశిక్షణ మరియు అగ్రశ్రేణి ఏకాగ్రత అవసరం. చాలా మంది ప్రతిభావంతులైన ఆర్చర్లను తయారు చేయడం ద్వారా ఈ క్రీడలో మంచి గుర్తింపు సాధిస్తోంది భారతదేశం.