Advertisementt

నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్ - కీర్తి సురేష్‌

Thu 25th Mar 2021 09:30 AM
rang de movie grand release event,rang de movie,rang de movie grand release function,nithin rang de movie,nithin,keerthy suresh,venky atluri,devi sri prasad,rang de movie review,rang de review rating  నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్ - కీర్తి సురేష్‌
Rang De grand release event నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్ - కీర్తి సురేష్‌
Advertisement
Ads by CJ

సరదాగా, సందడిగా రాజమండ్రిలో రంగ్ దే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

యూత్ స్టార్ నితిన్ న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవర నాగ‌వంశీ నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్ వీడియోల‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ నెల 26న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం రాత్రి రాజ‌మండ్రిలో గ్రాండ్‌గా నిర్వహించారు.  

రాక్ స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా వుంది. కొన్ని రోజుల క్రితం ఉప్పెన‌కు వ‌చ్చాం.. ఊపేశారు. ఇప్పుడు రంగ్ దేకు వ‌చ్చాం. ఈ మూవీ ఆడియోను బ్లాక్ బ‌స్ట‌ర్ చేసినందుకు చాలా థ్యాంక్స్‌. రంగ్ దే వెరీ రొమాంటిక్‌, సెంటిమెంట్‌, ఫ్యామిలీ, యూత్‌, అంద‌రికీ న‌చ్చే విధంగా కామెడీ అన్నీ వున్నాయి ఈ సినిమాలో. సో ఖ‌చ్చితంగా మీ అంద‌రికి న‌చ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తార‌నుకుంటున్నాం. నేను కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన‌ప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్ర‌త్యేకంగా చెప్పాలంటే వెంకీ గారు చాలా అందంగా తీర్చిదిద్ది ఈ సినిమాని తీశారు. థాంక్యూ వెంకీ గారు ఇలాంటి వండ‌ర్‌ఫుల్ రొమాంటిక్ మూవీకి వ‌ర్క్ చేసినందుకు. థ్యాంక్యూ ఫ‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ గారు. ప్రారంభం నుంచి నాకు పేరు తెచ్చిన‌వి ల‌వ్ స్టోరీసే. ఆనందం, సొంతం.. వ‌ర్షం కానీ..ఈ మ‌ధ్య కాలంలో చేసిన ఉప్పెన‌ కానీ రంగ్ దే కానీ మంచి పేరు తెచ్చి పెట్టాయి. తొలిసారి నితిన్‌గారు నేను క‌లిసి వ‌ర్క్ చేశాం. మెలోడీస్ తో చేసిన రొమాంటిక్ ఫిల్మ్ ఇది. నితిన్ గారితో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా వుంది. ప్ర‌తీ సాంగ్ కి నాకు ఫోన్ చేసి ఫుల్ జోష్ ఇచ్చేవారు. ఈ మూవీలో నితిన్ గారి న‌ట‌న చూస్తే ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ వుంటుంది. అల్ల‌రి కుర్రాడి నుంచి ఫుల్ కామెడీ చేస్తూ కీర్తిని ఏడిపించుకుంటూ ఫైన‌ల్‌గా మెచ్యూర్డ్ న‌ట‌న.. నాకు చాలా చాలా న‌చ్చింది. కీర్తి సురేష్‌, నితిన్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది అన్నారు. 

హీరో నితిన్ మాట్లాడుతూ రంగ్ దే సినిమా మార్చి 26న మీ ముందుకొస్తోంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఖ‌చ్చితంగా మీ అంద‌రికి బాగా న‌చ్చుతుంది. ఈ బ్యాన‌ర్‌లో నాకిది మూడ‌వ సినిమా. అ ఆ, భీష్మ ఇప్పుడు రంగ్ దే. సో ఆ రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఆడాల‌ని కోరుకుంటున్నాను. రాజ‌మండ్రికి లాస్ట్ టైమ్ భీష్మ‌ షూటింగ్‌కి వ‌చ్చాను. సాంగ్ షూట్ కోసం వ‌చ్చాను. ఆ సినిమా హిట్ట‌యింది. రంగ్ దే కోసం మ‌ళ్లీ ఇప్పుడు ఇక్క‌డికి వ‌చ్చాను. సెంటిమెంట్‌గా మ‌ళ్లీ ఆడాల‌ని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూస‌ర్ వంశీగారు ఇక్క‌డికి రాలేక‌పోయారు. వెంకీ అట్లూరి ఎప్ప‌టి నుంచో  నాకు మంచి స్నేహితుడు. త‌ను సినిమా బాగా చేశాడు. డీఎస్పీగారితో తొలిసారి వ‌ర్క్ చేశాను. చాలా అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. ఈ సాంగ్స్ చాలా రోజుల వ‌ర‌కు గుర్తుంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట‌లు చాలా పెద్ద హిట్ అవుతాయి. థ్యాంక్యూ దేవీ స‌ర్.. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. మ‌న కాంబో ముందు ముందు ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను. కీర్తీ చాలా మంచి న‌టి. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. త‌న రియ‌ల్ క్యారెక్ట‌ర్ అదే. అంద‌రిని టార్చ‌ర్ పెడుతూ వుంటుంది. అది చూసి స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ క‌థ రాశారు. మార్చి 26 థియేట‌ర్‌లో ఈ సినిమా చూడండి. ఏప్రిల్ 9న వ‌కీల్ సాబ్ చూద్దాం అన్నారు. 

కీర్తి సురేష్ మాట్లాడుతూ రొమాంటిక్  కామెడీ సినిమా ఇచ్చినందుకు వెంకీకి థ్యాంక్స్‌. డీఎస్పీతో ఇది నా థ‌ర్డ్ ఫిల్మ్‌. ఇది హ్యాట్రిక్ అవుతుంద‌ని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్‌. ఒక విష‌యం చెప్పాలి. ట్రైల‌ర్ చూస్తే నేను విల‌న్‌లా క‌నిపిస్తున్నాను. అది అబ‌ద్ధం. నితినే విల‌న్‌. సెకండ్ హాఫ్‌లో నేను రివేంజ్ తీర్చుకున్నాను. అది మాత్ర‌మే ట్రైల‌ర్‌లో వుంది. అది చూసి మ‌రోలా భావించ‌కండి. థియేట‌ర్లో సినిమా చూసి నిజం ఏంటో తెలుసుకోండి. థియేట‌ర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. 26న మా చిత్రం విడుద‌ల‌వుతోంది చూసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించండి అన్నారు. 

శ్రీ‌ముఖి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ కార్య‌క్ర‌మంలో టి టైమ్ ఉద‌య్‌, కాళీతేజ‌, అవి‌నాష్ కొల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే వేదిక‌పై రాజిరెడ్డి, స‌త్యకృష్ణ‌, మింది నాగేంద్ర .. యువ‌త హ‌రిత కార్య‌క్ర‌మం లో భాగంగా  చిత్ర బృందానికి మొక్క‌ల్ని అంద‌జేశారు. బ‌స్టాండే బ‌స్టాండే.. పాట‌కు ధేవిశ్రీ‌ప్ర‌సాద్‌, నితిన్‌, వెంకీ అట్లూరి, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. అంతే కాకుండా ఇదే వేదిక‌పై కీర్తి సురేష్‌తో పాట పాడించారు.

Rang De grand release event:

Rang De grand release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ