Advertisementt

పీన‌ట్ డైమండ్ టీజర్ విడుదల

Sat 20th Mar 2021 05:35 PM
peanut diamond movie,peanut diamond movie teaser release  పీన‌ట్ డైమండ్ టీజర్ విడుదల
Peanut Diamond Teaser Release పీన‌ట్ డైమండ్ టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామా పీన‌ట్ డైమండ్ టీజర్ విడుదల చేసిన డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ..!

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న చిత్రం పీన‌ట్ డైమండ్. ప్రొడ‌క్ష‌న్ నెం.1గా  నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా  జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ  ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని టాలీవుడ్ టాప్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు.. 

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. పీన‌ట్ డైమండ్..టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామా వస్తున్న ఈ సినిమా టీజర్ నేను రిలీజ్ చాలా ఆనందంగా ఉంది.. టీజర్ చూశాను.. ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా అంతే బాగుంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఈ సినిమా కూడా మంచి డిఫరెంట్ కంటెంట్ తో రాబోతుంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను.. వెంక‌టేష్ త్రిప‌ర్ణ  రాసిన డైలాగ్స్ బాగున్నాయి.. దర్శకత్వం గురించి చెప్పనవసరం లేదు. ఆ షాట్స్ చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  నిర్మాతలు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ  ఈ సినిమా కి ఎంత ఖర్చు పెట్టారో ఆ సినిమా క్వాలిటీ ని చూస్తుంటేనే తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్నారు.. 

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి న‌క్కా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శాని సాల్మాన్‌‌, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌, నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.

Peanut Diamond Teaser Release:

Peanut Diamond Movie Teaser Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ