Advertisementt

చావు కబురు కథ చెప్పేసిన అరవింద్

Wed 17th Mar 2021 11:45 AM
chavu kaburu challaga movie,allu aravind,kartikeya chavu kaburu challaga movie,chavu kaburu challaga grand release event,lavanya tripathi,chavu kaburu challaga greview  చావు కబురు కథ చెప్పేసిన అరవింద్
Chavu Kaburu Challaga Grand Release Event చావు కబురు కథ చెప్పేసిన అరవింద్
Advertisement

విశాఖ‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా జ‌రిగిన‌ చావు క‌బురు చ‌ల్లాగా జ‌రిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావుకబురు చల్లగా సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ చేశారు దర్శక నిర్మాతలు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ కు, వైజాగ్ కు విడదీయరాని సంబంధం ఉంది. గతేడాది ఇక్కడ ఏ ఫంక్షన్ చేసాము అందరికీ గుర్తుంది కదా..! సరైనోడు, గీత గోవిందం దగ్గర నుంచి అల వైకుంఠపురం దాకా అన్నీ వేడుకలు వైజాగ్ లో జరిపాం. ఈ ఊరితో ఉన్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే కొత్త కథలను కొత్త ఆలోచనలు ఆదరించే అలవాటు మీ అందరికీ ఉంది. ఇకపోతే చావు కబురు చల్లగా.. ఇది అసలు ఒక టైటిలేనా..? దర్శకుడు ఒక కథ రాసుకొని మీకు చావు కబురు చల్లగా అని ఒక కథ చెబుతాను అన్నాడు. ఎవరైనా చావు కబురు చల్లగా చెబుతారా.. కానీ దర్శకుడు ఈ సినిమాలో ఆ టైటిల్ కు న్యాయం చేశాడు. కార్తికేయ గురించి చెప్పాలి.. (నీకు మంచి ఫాలోయింగ్ ఉందయ్యా నీ పేరు చెప్పగానే అరుస్తున్నారు.. నవ్వుతూ) కథలో తీయడానికి ఏంలేదు భర్త చచ్చిపోయి హీరోయిన్ ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి ఆయన ఎలాగూ లేడు.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. ఇలాంటి విచిత్రమైన కథ అనేక మలుపులు తిరుగుతూ చావు కబురు చల్లగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కౌశిక్. కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే బాగుండు అని ప్రేక్షకులతో అనిపించేలా తెరకెక్కించాడు దర్శకుడు. లావణ్య ఎంత అద్భుతమైన నటి అనేది అందరికీ తెలుసు.. ఈ సినిమాలో గ్లామర్ తక్కువగా ఉండే పాత్ర చేసింది. మరో మంచి తల్లి క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. ఆమె ఇక్కడికి రాలేదు. మార్చి 19న మా సినిమా విడుదల అవుతుంది. ఒక మంచి సినిమా తీశాం. మీరందరూ థియేటర్లకి వచ్చి చూడండి. మీరు నా గురించి ఫాలో అవుతే నేను అంత గబుక్కున ఏ సినిమా బాగుంది అని చెప్పను.. ఇది నేను చూశాను బాగుంది.. మీరు కూడా రేపు మార్చి 19న థియేటర్లకు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి.. అని తెలిపారు.

దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..ఈ స్టేజి, సెటప్ చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగా నాకు అర్థం కావడం లేదు. వైజాగ్ మీరు సూపర్ అంతే. మేము వైజాగ్ లో షూట్ చేస్తున్నప్పుడు ఎంత మంది వచ్చారో.. ఇక్కడికి ఎంత మంది వచ్చారో.. వాళ్లంతా రేపు మార్నింగ్ షో టిక్కెట్లు తెగితే మేము సేఫ్ అంతే. థియేటర్ల వరకు వచ్చే బాధ్యత మీది.. మిమ్మల్ని నేర్పించే బాధ్యత మాది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాము. మీ అందరికీ థాంక్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. CMR షాపింగ్మాల్ రమణ గారికి స్పెషల్ థాంక్స్. ఏ డెబ్యూ డైరెక్టర్ కు కూడా ఇంత మంచి లాంచ్ దొరకదు.. ఇదంతా కేవలం అరవింద్ గారి వల్లే సాధ్యమైంది. థాంక్యూ సో మచ్ సార్. సభాముఖంగా మీ కాళ్ళకి నమస్కారం పెడుతున్నాను. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే సినిమా తీయాలని చాలా ఏళ్లుగా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. అలాంటిది నా తొలిసినిమా మూడు రోజుల్లో విడుదల కానుంది. ఆ సినిమాకోసం మీరంతా ఇలా వెయిట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మార్చి 19 తర్వాత బస్తీ బాలరాజు మాత్రమే గుర్తుంటాడు.. కార్తికేయ గుర్తుండడు. బయటకు వచ్చాక పేరు మారిపోతుంది. కార్తికేయలో మరో కోణాన్ని మీరు అందరూ చూస్తారు. అందరి కళ్ళు ఆయన మీదకి లాగేసుకున్నాడు. మల్లికా క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు.. ఏమాత్రం తేడా జరిగినా సినిమా అవుట్. అలాంటిది నువ్వు చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశావు లావణ్య. సినిమాలో నటించిన వాళ్లందరికీ, సాంకేతిక నిపుణులు అందరికీ థాంక్యూ సో మచ్.. అని తెలిపారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. మల్లిక క్యారెక్టర్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. చావు కబురు చల్లగా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి అద్భుతమైన కథ నాకు చెప్పినందుకు కౌశిక్ కు థాంక్స్. కార్తికేయ చాలా బాగా నటించాడు. మార్చ్ 19న అందరూ థియేటర్ లకి వచ్చి మా సినిమాను ఆదరించండి..అని తెలిపారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. హలో వైజాగ్.. ఈ సినిమాలో నేను చేసిన బస్తీ బాలరాజు గారు పూర్తిగా వైజాగ్ కుర్రోళ్ళను రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న బీచ్, ఇక్కడ ఫ్రెండ్స్ అందరు నాకు చాలా ఇష్టం. ఎన్ని రోజులు ఆర్ఎక్స్ 100 హీరోగా గుర్తు పెట్టుకున్నారు.. ఇకపై బస్తీ బాలరాజు పాత్ర లో నన్ను గుర్తు పెట్టుకుంటారు. మార్చ్ 19 నా చావు కబురు చల్లగా అన్ని థియేటర్లలో మారుమోగిపోవాలి. ఈ సినిమాను నిర్మించిన గీత ఆర్ట్స్ చాలామంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో లావణ్య తప్ప మేము అందరం దాదాపు కొత్త వాళ్ళం. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నిర్మాత బన్నీ వాసు గారు దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాపై చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత దాన్ని మించి హిట్ కొట్టే అవకాశం ఇన్నాళ్లకు దొరికింది. కుటుంబ సమేతంగా థియేటర్ లో కూర్చుని మా సినిమాను ఎంజాయ్ చేయండి. అని తెలిపారు.

Chavu Kaburu Challaga Grand Release Event:

Chavu Kaburu Challaga Grand Release Event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement