Advertisementt

దేవరకొండ కొత్త సినిమాలు

Mon 15th Mar 2021 04:22 PM
devarakonda new movies,madhura sridhar reddy,balaram verma namburi,bala somineni,roll camera visuals,high life entertainment production,kedar selagam shetty,vamsi karumanchi,director uday shetty  దేవరకొండ  కొత్త సినిమాలు
Devarakonda new movies దేవరకొండ కొత్త సినిమాలు
Advertisement
Ads by CJ

పుట్టిన రోజున రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ

దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ తో పాటు ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు ఆనంద్ దేవరకొండ. ఇవాళ (సోమవారం) పుట్టిన రోజు  జరుపుకుంటున్న ఆనంద్ దేవరకొండ తన రెండు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రెండు కొత్త సినిమా వివరాలు చూస్తే. 

మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ సినిమా ప్రకటించారు. బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధురా ఎంటర్ టైన్ మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

ఆనంద్ దేవరకొండ అనౌన్స్ చేసిన మరో చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి రూపొందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.

Devarakonda new movies:

Devarakonda new movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ