Advertisementt

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అశిష్ గాంధీ!

Wed 10th Mar 2021 06:07 PM
ashish gandhi,natakam fame ashish gandhi,  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అశిష్ గాంధీ!
Powerful Police Officer Ashish Gandhi! పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అశిష్ గాంధీ!
Advertisement
Ads by CJ

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న నాటకం ఫేమ్ అశిష్ గాంధీ!

నాటకం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశిష్ గాంధీ.. రగ్డ్ లుక్ లో కనిపించి తొలి సినిమా తోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది.. నాటకం చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ  దర్శకత్వం వహించడం విశేషం.. నాటకం సినిమా తో తన ప్రతిభ ను చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పు ని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్ కి వెళ్లబోతుంది.. మొత్తంగా ఈ సినిమా లో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా  తాజాగా పోలీస్ పాత్ర కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు. 

నటీనటులు: అశీష్ గాంధీ. 

సాంకేతిక విభాగం: ఎడిటర్: మణికాంత్, డీఓపీ: బాల్ రెడ్డి, కో ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి, ప్రొడ్యూసర్: నాగం తిరుపతి రెడ్డి, డైరెక్టర్: కళ్యాణ్ జి గోగణ.

Powerful Police Officer Ashish Gandhi!:

Natakam Fame Ashish Gandhi In A Powerful Police Officer Role!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ