యూత్ ఐకాన్‌గా నిఖిల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న సమయంలో కార్తికేయ అనే ప్రతిష్టాత్మక థ్రిల్లర్ విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసకుంది. ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్యప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా, అలరించేలా తన పెన్ కి పనిపెట్టే దర్శకుడు చందు మెుండేటి మరోక్కసారి మనకి తెలియని కొత్త కథతో రాబోతున్న చిత్రం కార్తికేయ 2. మంచి చిత్రాలు కమర్షియల్ విలువలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఈ రెండు నిర్మాణ సంస్థలు విడివిడిగా ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. అలాగే కలిసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. ఇప్పుడు మరొక్కసారి నిఖిల్, చందు మొండేటి క్రేజి కాంబినేషన్‌లో కార్తికేయ2 సినిమాని నిర్మిస్తున్నారు. గతేడాది శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్ తదితర కార్యక్రమాలు పక్కగా పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లిడానికి సిద్ధమైనట్లుగా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. గతంలో కార్తికేయ 2కి సంబంధించిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌కి అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్, ప్రపంచ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. మార్చ్ 7న ఈయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమాలోకి అనుపమ్ ఖేర్‌ను ఆహ్వానిస్తూ వీడియో విడుదల చేసారు కార్తికేయ 2 యూనిట్. ఈయన పాత్ర చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు చందూ మొండేటి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.