Advertisementt

బి.గోపాల్ విడుదల చేసిన ప్రియతమా ఆడియో!!

Sun 07th Mar 2021 04:43 PM
priyathama movie,priyathama movie audio  బి.గోపాల్ విడుదల చేసిన ప్రియతమా ఆడియో!!
Priyathama movie audio Released by B.Gopal బి.గోపాల్ విడుదల చేసిన ప్రియతమా ఆడియో!!
Advertisement
Ads by CJ

లెజెండరీ డైరెక్టర్ బి.గోపాల్ విడుదల చేసిన ప్రియతమా ఆడియో!! 

ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో  కర్నూల్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త  పులకుర్తి   కొండయ్య నిర్మాతగా సంతోష్ పార్లవార్  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రియతమా.. ఆనంద్ కుమార్, నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి, ముఖ్య పాత్రదారులు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ముగ్గురబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు మధ్య నడిచే ట్రయాంగిల్ లవస్టోరీ. ఈ చిత్రం ట్రైలర్ ని ఇటీవలే ప్రముఖ  దర్శకుడు  వి.వి. వినాయక్, రవికుమార్ చౌదరి విడుదల చేశారు. కాగా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. మార్చి లో రిలీజ్ కి సిద్ధమవుతోన్న ఈ సినిమా పై అంచనాలు ఉండగా తాజాగా  ఈ సినిమా ఆడియో ని రిలీజ్ చేశారు లెజెండరీ డైరెక్టర్ బి. గోపాల్..

ఈ సందర్భంగా బి.గోపాల్ మాట్లాడుతూ.. ప్రియతమా చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ చూశాను యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కింది అనిపిస్తుంది. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు అల్ ది బెస్ట్..  తప్పకుండా అందరూ ఈ సినిమా ని చూడండి.. నిర్మాత కొండయ్య గారికి అల్ ది బెస్ట్ అన్నారు. ఈ సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని..  అన్నారు. 

ఆనంద్ కుమార్, నాగ వంశీ కృష్ణ , వికాస్ చంద్ర, సంతోష్ పార్లవార్, ఉషా, ఏంజెల్, వృషాలి, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, సుమన్ శెట్టి, నర్సింగ్ యాదవ్, చంద్రమోహన్, రచ్చ రవి, అప్పారావు, సత్తిపండు, జయరాజ్, సన్నీ, స్నేహల్, సాక్షి, యాప్.యం. బాబాయ్, లక్ష్మీ ప్రసన్న, సంధ్యారాణి, నాగిరెడ్డి, యాదేశ్, రమేష్, సాధు, జె.శ్రీనివాస్, గోపి, వెంకట్ రెడ్డి, శివ, కె.నాగేశ్వరావు, దేవిధాస్, యం. సూర్యచందర్ రావు, యస్. శ్రీనివాసరావు, జి.నవీన్ కుమార్, కిరణ్ వైద్యా, కరుణాకరన్   తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం; చైతన్య, సినిమాటోగ్రఫీ; ఆనేం వెంకట్, ఎడిటింగ్; బి. మహేంద్రనాథ్, పాటలు; సంతోష్ పార్లవార్, పులకుర్తి కొండయ్య, నవీన్ రాంపోగు, హర ఉప్పాడ, నిర్మాత; పులకుర్తి కొండయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; సంతోష్ పార్లవార్.

Priyathama movie audio Released by B.Gopal:

Priyathama movie audio Released by B.Gopal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ