Advertisementt

ఆఫీషియల్: రామ్ సరసన ఉప్పెన బ్యూటీ

Fri 05th Mar 2021 07:10 PM
krithi shetty,uppena beauty,ram pothineni,lingusamy,bilingual film,rapo19  ఆఫీషియల్: రామ్ సరసన ఉప్పెన బ్యూటీ
Krithi Shetty Onboard for RAPO19 ఆఫీషియల్: రామ్ సరసన ఉప్పెన బ్యూటీ
Advertisement
Ads by CJ

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జోరు మాములుగా లేదు. ఉప్పెన సక్సెస్ అయ్యింది. నాని, సుధీర్ బాబు సరసన సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు రామ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ అయ్యింది. ఉప్పెన సక్సెస్ అవ్వకముందే పాప జోరు చూసిన వారికీ.. హిట్ అయ్యాక పాపని ఆపగలరా? ఇలానే అవకాశాలతో చెలరేగిపోతుంది. కృతి శెట్టి రామ్ సినిమాలో నటిస్తుంది అంటూ అధికారికంగా ప్రకటించింది టీం.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పందెంకోడి ఫేమ్ లింగుసామి కాంబినేష‌న్ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టి ఫిక్స్.

ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా  తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్  చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపోందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో అల్ట్రా మాస్ చిత్రంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం నటిస్తున్నారు.

Krithi Shetty Onboard for RAPO19:

Krithi Shetty Onboard for Ram Pothineni and Lingusamy Bilingual Film RAPO19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ