Advertisementt

'పుష్పక విమానం'లో దేవరకొండ

Mon 01st Mar 2021 03:05 PM
pushpaka vimanam movie,pushpaka vimanam,anand devarakonda  'పుష్పక విమానం'లో దేవరకొండ
Pushpaka Vimanam as Anand Devarakonda Hero 'పుష్పక విమానం'లో దేవరకొండ
Advertisement
Ads by CJ

దొరసాని సినిమాలో లో క్లాస్ అబ్బాయిగా, ప్రేమ కోసం ప్రాణాలు వదిలిన కుర్రాడిగా, మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ మిడిల్ క్లాస్ అబ్బాయిలా.. బొంబాయి చెట్నీ కాన్సెప్ట్ తో హోటల్ పెట్టి సక్సెస్ అయ్యి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ హీరోగా నిరూపించుకుంటున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆకట్టుకున్న దేవరకొండ ఆనంద్ ఇప్పుడు పుష్పక విమానం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

దొరసాని లాంటి మంచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన మూడో సినిమాగా పుష్పక విమానం అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ.. ఈ కథని న్యూస్ లో చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత క్యారెక్టర్స్ ని జోడించి తయారు చేసుకున్నాను, మొదట ఈ కథని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో  ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అదే టైం లో ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా రిలీజ్ అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ, పెళ్లి చుట్టూ వుండే  పరిస్థితులని పెడుతుంది. ఇందులో ఆనంద్ తో పాటు సునీల్,  నరేష్ ముఖ్య పాత్రలలో  కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని, ఇందులో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతుంది అని అన్నారు.

సమర్పణ: విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్: నీల్ సెబాస్టియన్, ఎడిటర్: రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని. కాస్టూమ్స్: భరత్ గాంధీ, నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.

Pushpaka Vimanam as Anand Devarakonda Hero:

Pushpaka Vimanam as Anand Devarakonda Hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ