Advertisementt

A టీం ని అభినందించిన విజయ్ సేతుపతి..

Fri 26th Feb 2021 04:59 PM
a movie,  A టీం ని అభినందించిన విజయ్ సేతుపతి..
Makkal Selvan Vijay Sethupathi Appreciates Team A A టీం ని అభినందించిన విజయ్ సేతుపతి..
Advertisement
Ads by CJ

A మూవీ టీం ని అభినందించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి..!

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై  గీతా మిన్సాల నిర్మించిన చిత్రం A. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో పాటు సినిమా పై మరిన్ని అంచనాలను పెంచింది. తాజాగా A మూవీ టీం ని అభినందించారు  విజయ్ సేతుపతి. చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. ఇటీవలే ముంబై లో ఉన్న విజయ్ సేతుపతి ని చిత్ర బృందం  కలిసి తమ సినిమా కు సపోర్ట్ గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొంత పార్ట్ ని చూసి అయన ఎంతో థ్రిల్ కి గురయ్యారు.  సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు. విజయ్ సేతుపతి సపోర్ట్ ఉండడంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువయ్యింది. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ని PVR పిక్చర్స్ వారు ఘనంగా విడుదల చేయబోతున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నిఅందించారు. 

నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం; విజయ్ కురాకుల, నిర్మాత; గీతా మిన్సాల దర్శకత్వం; యుగంధర్ ముని.

Makkal Selvan Vijay Sethupathi Appreciates Team A:

Makkal Selvan Vijay Sethupathi Appreciates Team A

Tags:   A MOVIE,
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ