Advertisementt

కోలు కోలు అంటున్న నేచురల్ బ్యూటీ

Thu 25th Feb 2021 05:06 PM
kolu kolu song lyrics,sai pallavi,sai pallvi in virata parvam,virata parvam song,rana,priyamani  కోలు కోలు అంటున్న నేచురల్ బ్యూటీ
Kolu Kolu Song Lyrics in Virata Parvam కోలు కోలు అంటున్న నేచురల్ బ్యూటీ
Advertisement
Ads by CJ

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా విరాట‌ప‌ర్వం. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న విరాట‌ప‌ర్వంను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

నేడు ఈ చిత్రంలోని కోలు కోల‌మ్మా కోలో కోలో నా సామి మ‌న‌సే మేలుకొని చూసే. అంటూ సాగే సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. స్త్రీ ప్రేమ, అనంతమైన కథనాలను నిశ్శబ్దంగానే ప్రపంచానికి అందిస్తుందనే విష‌యాన్ని ఈ కోలు కోలు పాట మ‌న‌కు తెలియ‌జేస్తుంది. త‌ను మ‌న‌సిచ్చిన వాడి గురించి క‌థానాయిక వెన్నెల ఓ క‌థ‌నంలా పాడుకుంటోంది. వెన్నెల‌గా సాయిప‌ల్ల‌వి న‌టించింది. ఇప్ప‌టికే ఎన్నో గొప్ప పాట‌ల‌ను, మంచి పాట‌ల‌ను అందించిన చంద్ర‌బోస్ క‌లం మ‌రోసారి అనంత‌మైన ప్రేమ‌ను కురిపిస్తూ ఈ పాట‌ను అల్లింది.

పిల్ల‌గాడి మాట‌ల‌న్ని గాజుల‌ల్లె మార్చుకుంట‌.. కాలిధూళి బొట్టు పెట్టుకుంటా...

కుర్ర‌గాడి చూపుల‌న్ని కొప్పులోన ముడుచుకుంట‌.. అల్ల‌రంత న‌ల్ల‌పూస‌లంటా.."

లాంటి లైన్లు రాయ‌గ‌లిగింది ఆయ‌న క‌ల‌మే క‌దా!

సురేష్ బొబ్బిలి సుమ‌ధుర బాణీలు అందిస్తే, దివ్య‌మాలిక త‌న అంతే మ‌ధుర గాత్రంతో ఈ పాట‌కు ప్రాణమిచ్చారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిజానికి ఇవ‌న్నీ విరాట‌ప‌ర్వంపై అంచ‌నాల‌ను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిప‌ల్ల‌వి జోడీ చూడ‌చ‌క్క‌గా ఉంద‌ని అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు

Kolu Kolu Song Lyrics in Virata Parvam:

Kolu Kolu Song Lyrics in Virata Parvam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ