Advertisementt

A సినిమా తో మెస్మరైజ్ చేయనున్న ప్రీతీ అస్రాని

Mon 22nd Feb 2021 01:32 PM
preeti asrani,a movie,  A సినిమా తో మెస్మరైజ్ చేయనున్న ప్రీతీ అస్రాని
Preeti Asrani is the heroine who will mesmerize with A movie A సినిమా తో మెస్మరైజ్ చేయనున్న ప్రీతీ అస్రాని
Advertisement
Ads by CJ

A సినిమా తో మెస్మరైజ్ చేయనున్న హీరోయిన్ ప్రీతీ అస్రాని

బాలనటిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతీ అస్రాని.. ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత  గుండెల్లో గోదారి, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది. సుమంత్ హీరో గా నటించిన మళ్ళీ రావా చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె,  హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను  ఎంతగానో ఆకట్టుకుంది.. ప్రెషర్ కుక్కర్ సినిమా తో పూర్తి స్థాయి  హీరోయిన్ గా మారిన ప్రీతీ అస్రాని ఆ సినిమా లోని తన నటన తో విమర్శకుల ప్రశంశలు అందుకుంది.

కాగా యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నితిన్ ప్రసన్న హీరోగా రాబోతున్న A చిత్రంలో హీరోయిన్ గా ఎంతో కీలకమైన పాత్ర చేసింది ప్రీతీ అస్రాని.. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మాతగా యుగంధర్ ముని దర్శకత్వంలో వస్తున్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంలో ప్రీతీ పాత్ర చాల కొత్తగా, ఆసక్తికరంగా ఉండబోతుందట. ఇప్పటికే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగ, ట్రైలర్ తో ఈ సినిమా అంచనాలు పెంచేసుకుంది.

విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నిఅందించారు. ఇటీవలే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న A చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కాబోతుంది.   

నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సినిమాటో గ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం; విజయ్ కురాకుల, నిర్మాత; గీతా మిన్సాల దర్శకత్వం; యుగంధర్ ముని.

Preeti Asrani is the heroine who will mesmerize with A movie:

Preeti Asrani is the heroine who will mesmerize with A movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ