సక్సెస్ ఫుల్ గా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సందీప్ మాధవ్ గంధర్వ!
వంగవీటి, జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, అక్షత హీరోయిన్స్ గా ఎస్ అండ్ యమ్ క్రియేషన్స్ మరియు వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకలపై అప్సర్ హుస్సేన్ దర్శకత్వంలో ఎమ్ ఎన్ మధు గంధర్వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకొని ఈరోజుతో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది.. ఈ సందర్బంగా చిత్ర విశేషాలను యూనిట్ తెలియజేశారు..
నిర్మాత ఎమ్ ఎన్ మధు మాట్లాడుతూ.. కధా పరంగా గంధర్వ అద్భుతం సృష్టించబోతుంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం.. సినిమా చాలా ఎక్స్ లెంట్ గా వస్తోంది. యూనిట్ అంతా చాలా కోపరేట్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. రెండవ షెడ్యుల్ మార్చ్ నుండి స్టార్ట్ చేస్తాం. హీరో సందీప్ మాధవ్, గాయత్రి, అక్షత అత్యద్భుతంగా నటిస్తున్నారు. అలాగే మా చిత్రంలో సాయికుమార్, సురేష్, పోసాని, బాబు మోహన్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి సూపర్బ్ గా నటిస్తున్నారు.. అన్నారు.
దర్శకుడు అప్సర్ హుస్సేన్ మాట్లాడుతూ.. మా గంధర్వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ గా మొదటి షెడ్యూల్ పూర్తిచేశాం. ఈ చిత్రాన్ని మిగితా భాషల్లో కూడా చిత్రీకరణ జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి షెడ్యుల్ కోసం కేరళ, గోవా, ఊటీ లాంటి లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరపడానికి ప్లాన్ చేస్తున్నాం. రాప్ రాక్ షకీల్ బ్యూటిఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. మా యూనిట్ అంతా ఎంతో ఉత్సాహంతో.. సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్స్ తో వర్క్ చేస్తున్నారు. అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ.. ఎంకరేజ్ చేస్తున్నారు. త్వరలోనే టీజర్ మరియు లిరికల్ వీడియో విడుదల చేయనున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి డివోపి; జవహర్ రెడ్డి, సంగీతం; రాప్ రాక్ షకీల్, ఎడిటర్; బుల్లిరెడ్డి, ఆర్ట్; జే కే మూర్తి, కో-డైరెక్టర్; ప్రకాష్ పచ్చల, ప్రొడక్షన్ కంట్రోలర్; జె.రామారావు, కో ప్రొడ్యూసర్; యమ్.యన్. నారాయణ్, పిఆరోఓ; సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, నిర్మాత; ఎమ్ ఎన్ మధు, స్క్రీన్ ప్లే-వీరశంకర్, దర్శకత్వం; అప్సర్ హుస్సేన్.