Advertisementt

మార్చి 5న యాంక‌ర్ ర‌వి ‌తోట‌బావి

Sat 20th Feb 2021 08:09 PM
thota baavi movie,anchor ravi thota baavi,anchor ravi thota baavi movie released on march 5th  మార్చి 5న యాంక‌ర్ ర‌వి ‌తోట‌బావి
Anchor Ravi Thota Baavi Movie Released on March 5th మార్చి 5న యాంక‌ర్ ర‌వి ‌తోట‌బావి
Advertisement
Ads by CJ

మార్చి 5న యాంక‌ర్ ర‌వి ‌తోట‌బావి చిత్రం విడుదల!

యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలను పొందిన రవి హీరో గా నటిస్తున్న చిత్రం తోట‌బావి. అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. గౌత‌మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు(విష్ణుప్రియహోట‌ల్) చిన్న స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభినేష్. బి స‌హ‌నిర్మాత‌. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేయగా టీజర్ కి విశేష స్పందన లభించింది. అంతకుముందు వచ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ  ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.  మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది సినిమా. సెన్సార్ చేసిన సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. హీరో ర‌వి గారి నటనను ప్రసంశించారు. ముందునుంచి రవిగారు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో  థ్రిల్ చేయడానికి ఈ మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.. అన్నారు. 

నిర్మాతలు  ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్, దౌలు చిన్న స్వామి,  అభినేష్. బి మాట్లాడుతూ మార్చి 5 న  రాబోతున్న ఈ సినిమా ని ప్రేక్షకులను ఆదరించాలి.. సినిమా ఆద్యంతం అలరిస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. డైరెక్టర్ మా నమ్మకాన్ని నిలబెట్టాడు.. ఏదైతే చెప్పాడే అంతకుమించి తెరకెక్కించాడు. హీరో రవి గారు చాల బాగా నటించారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా రవిగారిని ఈ సినిమాలో చూపించబోతున్నాం..ఈ సినిమా చూసి అందరు తప్పకుండ థ్రిల్ ఫీల్ అవుతారు అని అన్నారు.. 

నటీనటులు : ర‌వి, గౌత‌మి, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్, న‌ర్సింహా రెడ్డి,  జ‌బర్ద‌స్త్  అప్పారావు, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, రోహిణి, ఉన్నికృష్ణ‌, అభి, శివం త‌దిత‌రులు 

సాంకేతిక విభాగం : సినిమాటోగ్ర‌ఫీ: చిడ‌త‌ల న‌వీన్, ఎడిట‌ర్: గిరి, స‌ంగీతం: దిలీప్ బండారి, స‌్టంట్స్: శంక‌ర్‌, కొరియోగ్ర‌ఫీ: స‌న్ని, లిరిక్స్: రామాంజ‌నేయులు, స్టిల్స్: పాండు రంగ‌, స‌హ‌నిర్మాత‌: , అభినేష్ .బి, నిర్మాత: ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు (విష్ణుప్రియ హోట‌ల్) చిన్న స్వామి, క‌థ‌-స్క్రీన్ ప్లే -మాటలు-ద‌ర్శ‌క‌త్వం: అంజి దేవండ్ల‌.

Anchor Ravi Thota Baavi Movie Released on March 5th:

Anchor Ravi Thota Baavi movie released on March 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ