Advertisementt

సారీ గీత వెబ్ మూవీ..!

Sat 20th Feb 2021 07:56 PM
sorry getha web movie,sari geeta web movie,sorry getha  సారీ గీత వెబ్ మూవీ..!
Sorry Getha Web Movie సారీ గీత వెబ్ మూవీ..!
Advertisement
Ads by CJ

విడుదలకు సిద్ధమయిన సారీ గీత వెబ్ మూవీ..!

టాలీవుడ్ పలు పెద్ద సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కృష్ణ పామర్తి స్థాపించిన కేపీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మొదటి వెబ్ మూవీ సారీ గీత విడుదలకు సిద్ధమైంది. ప్రదీప్ కుమార్ ఎమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాసిడ్ దాడి జరిగిన అమ్మాయి లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కింది..ఈ మధ్య కాలంలో ఆడవారిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఆసక్తి మొదలైంది. సాయి పవన్ తేజ, శ్వేతా రెడ్డి జంటగా నటించిన ఈ సినిమా కి దుర్గ అనిల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా కేపీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కృష్ణ పామర్తి నిర్మించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కృష్ణ పామర్తి మాట్లాడుతూ.. అనుకున్నదానికంటే సినిమా చాలాబాగా వచ్చింది. కొత్తవారైనా దర్శకుడు ప్రదీప్ కుమార్ సినిమా ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. దుర్గ అనిల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నా నమ్మకాన్ని వారు నిలబెట్టారు. హీరో హీరోయిన్ లు కూడా చాల బాగా నటించారు. వారికి మంచి భవిష్యత్ ఉంటుంది. ఆద్యంతం ప్రేక్షకుడిని అలరించే సినిమా ఇది..  ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.. 

నటీనటులు: సాయి పవన్ తేజ, శ్వేతా  రెడ్డి.

బ్యానర్ : కేపీ ఎంటర్టైన్మెంట్స్, డైరెక్టర్ : ప్రదీప్ కుమార్.ఎమ్, కెమెరా : దుర్గ అనిల్ రెడ్డి, ప్రొడ్యూసర్ : కృష్ణ పామర్తి.

Sorry Getha Web Movie:

Sari Geeta Web Movie..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ