Advertisementt

రాజీవ్ సాలూరి క్రైమ్ థ్రిల్లర్ అన్ నోన్..?

Fri 19th Feb 2021 07:51 PM
unknown movie,rajev saluri,koti,  రాజీవ్ సాలూరి క్రైమ్ థ్రిల్లర్ అన్ నోన్..?
Rajiv Saluri Crime Thriller Unknown రాజీవ్ సాలూరి క్రైమ్ థ్రిల్లర్ అన్ నోన్..?
Advertisement
Ads by CJ

మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న రాజీవ్ సాలూరి క్రైమ్ థ్రిల్లర్ అన్ నోన్..?

టాలీవుడ్ లో తన సంగీతం తో ప్రేక్షకులను అలరించిన కోటి అయన వారసుడిగా రాజీవ్ సాలూరి ని హీరో గా రంగప్రవేశం చేయించారు..  నోట్ బుక్, ప్రేమంటే సులువు కాదురా, ఆకాశమే హద్దు, ఓరి దేవుడోయ్, చిన్ని చిన్ని ఆశ వంటి సినిమాలతో రాజీవ్ సాలూరి హీరోగా అందరికి సుపరిచయమవగా ఆ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన నటన తో ఇప్పటికే కొంత అభిమానాన్ని అందుకున్న రాజీవ్ నటించబోతున్న కొత్త చిత్రం అన్ నోన్ మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు వెల్లడించగా,  క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఆర్కే నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణరావు అట్లూరి వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోటి మరో తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ.. మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం.. దర్శకుడు ఆర్కే నల్లూరి చెప్పిన కథ చాలా బాగుంది.. పూర్తిగా కథను నమ్మి చేస్తున్న సినిమా ఇది.. రాజీవ్ గత సినిమాల్లో చాలా బాగా చేశాడు.. ఈ కథ కు అయన చాలా బాగా సూట్  అవుతున్నాడు.. ఈ మార్చి 5 నుంచి షూటింగ్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం.. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని అన్నారు. 

నటీన‌టులు: రాజీవ్ సాలూరి

సాంతికేతిక వ‌ర్గం: బ్యానర్ : వైష్ణవి ఫిలిమ్స్, సంగీతం : రోషన్ సాలూరి, నిర్మాత : నారాయణరావు అట్లూరి, దర్శకత్వం : ఆర్కే నల్లూరి.

Rajiv Saluri Crime Thriller Unknown:

Rajiv Saluri crime thriller shooting unknown from March 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ