Advertisementt

ఆకాష్ పూరీ చోర్ బజార్

Thu 18th Feb 2021 03:20 PM
akash puri,jeevan reddy,chor bazaar movie,puri,subbaraju,chor bazaar movie launch  ఆకాష్ పూరీ చోర్ బజార్
Akash Puri-Jeevan Reddy Chor Bazaar movie launch ఆకాష్ పూరీ చోర్ బజార్
Advertisement
Ads by CJ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు యువ హీరో ఆకాష్ పూరీ తన మూడో చిత్రాన్ని కన్ఫర్మ్ చేశారు. జార్జ్ రెడ్డి చిత్రంతో విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి ఇన్ స్ఫైరింగ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆకాష్ పూరీ, జీవన్ రెడ్డి కాంబినేషన్ చిత్రానికి చోర్ బజార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్ కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు.

చోర్ బజార్ సినిమా గురువారం  హైదరాబాద్ లోని ప్రొడక్షన్ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో ఆకాశ్ పై సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐ.వి ఎస్.ఎన్ రాజు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్ ను అందించారు. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చోర్ బజార్ చిత్రంలో సుబ్బరాజు, పోసాని,  లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చోర్ బజార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.

Akash Puri-Jeevan Reddy Chor Bazaar movie launch:

Akash Puri-Jeevan Reddy Chor Bazaar movie launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ