Aలో సిలకా సిగురు సాటుకు తమన్ చేయూత
Thaman Launches Silaka Silaka Lyrical Video From A Movieసైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీ Aలో సిలకా సిగురు సాటుకు పోకే... పాటను విడుదల చేసిన మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్
సిలకా సిగురు సాటుకు పోకే.. సెలికాని ఎదగూటికి రాయె
జడ కుచ్చులలోన నలగాలని ఉందె,
ఒడిలో తలవాల్చిఒదగాలని ఉందె రాయె..
అని ప్రియుడు తన ప్రియురాలి కోసం పాట పాడుకుంటే ఎలా ఉంటుంది. మనసు కరగని ప్రియురాలు ఉంటుందా..! తన ప్రేమనంతా పాటలో కురిపించే ప్రియుడు మనసు లోతును తెలుసుకోవడానికి ప్రియురాలు ఏం చేసింది? అనేది తెలుసుకోవాలంటే A సినిమా చూడాల్సిందే అని అంటున్నారు దర్శకుడు యుగంధర్ ముని. ఈయన దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీ A. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో విజయ్ కురాకుల సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో సిలకా సిగురు సాటుకు పోకే.. పాటను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ విడుదల చేసి సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. అనంతర శ్రీరామ్ రాసిన ఈ పాటను దీపు పాడారు. జానపదం స్టైల్లో సాగుతున్న పాట ప్రేకకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విజయ్ సేతుపతి విడుదల చేసిన A ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 5న విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు మా సినిమాకు మంచి సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు. వారి అంచనాలకు ధీటుగా సినిమా ఉంటుందని నిర్మాత గీతా మిన్సాల తెలిపారు.
నటీనటులు: నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు
A movie grand release on March 5th through PVR Pictures






































