మే 7న విడుదలకు సిద్ధమవుతోన్న శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 101 జిల్లాల అందగాడు
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వైవిధ్యమైన కథా చిత్రాలను అందించాలనే ఆలోచనతో ఉన్న తన వద్దకు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వస్తే నిర్మాతగా తన వంతు సహకారం అందించి నిర్మాణంలో భాగస్వామినవడానికి తాను సిద్ధమని ఇటీవల దిల్‌రాజు తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు వైవిధమ్యైన చిత్రాలను ప్రేక్షకులకు అందించే దర్శకుడు క్రిష్‌తో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 101 జిల్లాల అందగాడు సినిమాను రూపొందుతోంది.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నూటొక్క జిల్లాల అందగాడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాచకొండ విద్యాసాగర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లో డిఫరెంట్ మూవీస్‌లో నటుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్‌గా, రైటర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ 101 జిల్లాల అందగాడు చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా తనదైన కామెడీ పంచులతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్‌టైనింగ్ కథను అందించారు.
ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 7న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ(చి.ల.సౌ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ తదితరులు
సాంకేతిక వర్గం: దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్, సమర్పణ: దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్, నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, రచయిత: అవసరాల శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: రామ్, ఎడిటర్: కిరణ్ గంటి, సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఆర్ట్: ఎ.రామాంజనేయులు, డిజైనర్: ఐశ్వర్యా రాజీవ్.