Advertisementt

చావు క‌బురు చ‌ల్ల‌గా అన‌సూయ స్పెష‌ల్

Mon 15th Feb 2021 04:49 PM
anasuya,special item song,chavu kamburu challanga movie,karthikeya,lavanya tripathi  చావు క‌బురు చ‌ల్ల‌గా అన‌సూయ స్పెష‌ల్
Anasuya Special Item Song in Chavu Kamburu Challanga చావు క‌బురు చ‌ల్ల‌గా అన‌సూయ స్పెష‌ల్
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు యంగ్ హీరో కార్తికేయ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో అన‌సూయ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్

మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ బ‌స్తి బాల‌రాజు ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అలానే ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేశారు. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

Anasuya Special Item Song in Chavu Kamburu Challanga:

Anasuya Special Item Song in Chavu Kamburu Challanga Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ