Advertisementt

లగడపాటి కొడుకుకు కొత్తగా రెక్కలొచ్చెనా.!

Mon 15th Feb 2021 01:48 PM
kothaga rekkalochena movie logo launch,kothaga rekkalochena movie,kothaga rekkalochena movie logo launch,kothaga rekkalochena movie logo launch by uppena team  లగడపాటి కొడుకుకు కొత్తగా రెక్కలొచ్చెనా.!
Kothaga Rekkalochena Movie Logo Launch లగడపాటి కొడుకుకు కొత్తగా రెక్కలొచ్చెనా.!
Advertisement
Ads by CJ

రామలక్ష్మి సినీ క్రియేషన్స్ కొత్తగా రెక్కలొచ్చెనా  లోగో &  ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఉప్పెన టీం

వాలంటైన్స్ డే స సందర్భంగా  రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన కొత్తగా రెక్కలొచ్చెనా సినిమా లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉప్పెన చిత్ర యూనిట్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

అనంతరం లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. కోవిడ్ టైం లో అందరమూ ఎన్నో ఇబ్బందులతో ఎంతో బాధపడ్డాము. కొవిడ్ తర్వాత అందరికీ కొత్త రెక్కలు వచ్చినట్లు, న్యూ లైఫ్ బిగిన్ అయినట్లు భావిస్తున్నారు అలాగే ఈ  సినిమా కొత్తగా రెక్క.లొచ్చెనా సినిమా ప్రజెంట్ జనరేషన్ ఆఫ్టర్ 80 తర్వాత ఉన్న జనరేషన్ కు ఉన్న ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఈ మూవీ చేయడం జరిగింది .అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి  ప్రదీప్ దర్శకుడిగా ఈ మూవీకి పరిచయం అవుతున్నాడు. కొత్తగా రెక్కలొచ్చెనా లోగోను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు,నిర్మాత నవీన్ లు లాంచ్ చేయడం, ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో వైష్ణవ్ తేజ్,కృతి శెట్టిలు లు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ... బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఉప్పెన సినిమాకు మేము అభిననంద సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభకు వచ్చిన  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు .చిరంజీవి గారు సుకుమార్ గారు చెప్పినట్లు ఈ సినిమా అందరి అంచనాలు మించి ఉంటుంది  వారన్న వాక్యాలు అక్షర సత్యాలు అవ్వడమేకాక వారి మాటలకు ఇంకా వ్యాల్యూ పెరిగింది.ఇందులో నటించిన నటీనటులందరూ కొత్తవారైనా అన్ని విభాగాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చిత్ర నిర్మాత నవీన్ గారు తెలుగువాడైనా అమెరికాలో ఉండి వచ్చి సినిమాపై వున్న ఫ్యాషన్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ను స్థాపించి మంచి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ఒక శ్యాంప్రసాద్రెడ్డి, ఎమ్మెస్ రాజు, లేట్ రామానాయుడు ,దిల్ రాజు ల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఇలా వీరందరూ తెలుగు ఇండస్ట్రీ ని బాలీవుడ్, హాలీవుడ్ వారు తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా  మన తెలుగు సినిమా ను ఒక రేంజ్ కి తీసుకెళ్లారు .ఈ మధ్య మన తెలుగు సినిమాలు తెలుగోడి దమ్ము ఏందో చూపిస్తున్నాయి.వీళ్లను చూస్తుంటే నేను తీసిన  స్టైల్ సినిమాలోని తెలుగోడి స్టైలే దుమ్ములేపే స్టైలే డైలాగ్ వీరికి కరెక్టు యాప్ట్ అవుతుంది.బుచ్చిబాబు సుకుమార్ గారికి  ఉప్పెన రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చి గురువుని మించిన శిష్యుడు అని పించుకున్నారు.దర్శకుడు రస్టిక్ స్టోరీ తో  మేకప్ లేకుండా ఈ కథను ఎంచుకొని అద్భుతమైన సినిమా తీశారు.హీరో మేకప్ లేకుండా న్యాచురల్ గా నటించి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్  పించాడు..హీరోయిన్ ఎమోషన్స్ ఫర్ఫార్మెన్స్ చూస్తుంటే మరో దీపికా పదుకొనే వచ్చినట్లు ఉంది.ప్రేమ పేరుతో వచ్చిన ఎన్నో సినిమాల క్లైమాక్స్ స్యాడ్ ఎండింగ్ తో ముగించాయి. కానీ ఈ సినిమా క్లైమాక్స్ చూసిన చూసిన ప్రేక్షకులకు రియల్ లైఫ్ లో ప్రేమపై మరింత గౌరవం పెంచేలా చేసింది. థియేటర్లలో చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాల క్లైమాక్స్ సీన్స్ లకు ప్రేక్షకులు ఇంత రెస్పాన్స్ అవుతారో  ఈ మూవీలోని క్లైమాక్స్ కు అంత రెస్పాన్స్ కావడం గొప్ప విశేషం ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని దాంట్లో సందేహం లేదు.ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి పాన్ ఇండియా ఫిల్మ్ అయ్యేలా చేశారు.ఇంత పెద్ద హిట్ అయిన సినిమాకు మా కొత్తగా రెక్కలొచ్చెనా టీం తరుపున అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ..రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తీసిన కొత్తగా రెక్కలొచ్చెనా సినిమా ద్వారా మా ఉప్పెన టీమ్ ను ఎంకరేజ్ చేయాలని ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది మళ్లీ ప్రూవ్ చేశారు .మేము ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే  అనుకున్నదానికంటే రోజురోజుకూ పెరుగుతున్నాయి హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది ఇది మాకొక కొత్త ఎక్స్పీరియన్స్.మాకింత విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. కొత్తగా రెక్కలొచ్చెనా పాట అంటే ఎంతో ఇష్టం. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ ఆ అందరికీ తెలుసు.ఆ పాటలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని టీం కు విషెస్ తెలియజేస్తూ ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ... కొత్తగా రెక్కలొచ్చెనా సినిమా శ్రీధర్ గారికి మంచి విజయం సాధించాలని తెలియజేస్తూ..ఈ చిత్రంలో మేము కొత్త వారిమైనా విజయ్ సేతుపతి గారు,బుచ్చి బాబు,నిర్మాతలు నాకు ఫుల్ సపోర్ట్ చేసి మా దగ్గర మంచి నటన రాబట్టుకున్నారు ఇలాంటి సినిమాల్లో నటించడం నేను అదృష్టం గా భావిస్తున్నాను నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ...కొత్తగా రెక్కలొచ్చెనా సినిమా పోస్టర్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది .ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తెలియజేస్తూ..ఉప్పెన సినిమా లో దర్శకులు నన్ను ఒక పార్ట్ చేశారు.ఈ సినిమాకు ఇంత ఆదరణ రావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారు నన్ను చాలా అందంగా చూపించారు ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

నటీనటులు :- విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ భవిశెట్టి, స్నేహల్ కమల్, అభిజిత్ దేశ్ పాండే,, జయశ్రీ రాచకొండ మొదలగువారు

రైటర్ అని డైరెక్టర్ :- ప్రదీప్ బి అట్లూరి, ప్రొడ్యూసర్స్ :- శిరీష లగడపాటి & శ్రీధర్ లగడపాటి, డిఓపి :-అనీష్ తరుణ్ కుమార్, మ్యూజిక్ :-అచ్చు రాజమణి, ఎడిటర్ :- గ్యారి బిహెచ్, ప్రొడక్షన్ డిజైనర్ :-ఉదయ్ ఉమ గోపాల్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ :- గోపీచంద్ లగడపాటి, క్యాస్థూమ్స్ :- భరత్ గాంధీ, ప్రొడక్షన్ హౌస్ :- రామ లక్ష్మి సినీ క్రియేషన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర అన్న, క్యాస్టింగ్ డిజైనర్ :- పుష్ప భాస్కర్, పి ఆర్వో :- దాసరి రాజేష్.

Kothaga Rekkalochena Movie Logo Launch:

Kothaga Rekkalochena Movie Logo Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ