Advertisementt

వరుడు కావలెను వాలంటైన్స్ డే స్పెషల్

Sun 14th Feb 2021 04:15 PM
valentines day,varudu kaavalenu,naga shaurya,ritu varma,love song,sitara entertainments  వరుడు కావలెను వాలంటైన్స్ డే స్పెషల్
Varudu Kaavalenu Song Launch వరుడు కావలెను వాలంటైన్స్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

*ప్రేమికుల దినోత్సవం కానుకగా వరుడు కావలెను నుంచి నాగ శౌర్య , రీతువర్మ ల ప్రేమ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్

*ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన మరో సుమధురమైన గీతం 

*  సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం 

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం వరుడు కావలెను 

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (14-2-2021) వరుడు కావలెను చిత్రం యూనిట్ చిత్రం లోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే....

కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా 

నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా 

కొంటె నవ్వే అలా చంపుతుంటే ఎలా 

కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా 

మళ్ళీ మళ్ళీ రావే పూలజల్లు తేవే అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత రాంబాబు గోసల రచించారు. ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమ కు తెర రూపం గా  ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగ శౌర్య, రీతువర్మ లు అభినయం కట్టిపడేస్తుంది.

గీతాన్ని ఆలపించిన గాయకుడు సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ..చిత్ర సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమ కూర్చిన ఈ శ్రావ్య మైన గీతాన్ని ఆలపించటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ గీతం సంగీత ప్రియులకు చేరువ కావటం మరెంతో సంతోషం గా ఉందన్నారు. 

ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో, ఆ తరువాత 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఓ  ప్రచారచిత్రం, కథానాయకుడు నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది .. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరుడు కావలెను చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. 

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్     సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్

Varudu Kaavalenu Song Launch:

Valentines day gift Varudu  Kaavalenu from Naga Shaurya and Ritu Varma love song released by production company Sitara Entertainments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ