కోయిలమ్మ సీరియల్ హీరో అమీర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత కాలం నుండి అనేక వివాదాలలో తలమునకలైన కోయిలమ్మ సీరియల్ హీరో అమీర్ తన కెరియర్ ను పాడు చేసుకుంటూ టీవీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. కోయిలమ్మ సీరియల్ మాత్రమే కాకుండా.. జెమిని ఛానల్ లో బంగారు కోడలు లాంటి సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన హీరో అమీర్ ఫై అనేకమైన వివాదాలు కూడా వున్నాయి. బొటిక్ వ్యవహారంలో స్నేహితుల ఫై తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి దాడి చేసిన ఘటన ఆధారంగా రాయదుర్గం లో అమీర్ పై నమోదు అయిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు అమీర్ ని కూకట్ పల్లి కోర్ట్ లో హాజరు పరచగా రిమాండ్ విదించి అమీర్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.