Advertisementt

ఇక వాల్తేరు శీనుగా సుమంత్

Tue 09th Feb 2021 11:00 AM
anaganaga oka rowdy movie,sumanth  ఇక వాల్తేరు శీనుగా సుమంత్
Anaganaga Oka Rowdy First Look ఇక వాల్తేరు శీనుగా సుమంత్
Advertisement
Ads by CJ

న్యూలుక్‌తో అనగనగా ఒక రౌడీ.. వాల్తేరు శీనుగా సుమంత్  

వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి అనగనగా ఒక రౌడీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నేడు (ఫిబ్రవరి 9) సుమంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన సుమంత్ లుక్‌తో ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది. వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది. వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్.కె.రాబిన్, సహ నిర్మాత: యెక్కంటి రాజశేఖర్ రెడ్డి, రచన-దర్శకత్వం: మను యజ్ఞ.

Anaganaga Oka Rowdy First Look:

Happy Birthday Sumanth 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ