Advertisementt

స్టార్ మా లో ఈ ఆదివారం.. విందు భోజనం

Sat 06th Feb 2021 10:58 AM
sunday,specials,star maa,bigg boss uthsav,start music  స్టార్ మా లో ఈ ఆదివారం.. విందు భోజనం
Celebrate this Sunday with Specials on Star Maa స్టార్ మా లో ఈ ఆదివారం.. విందు భోజనం
Advertisement
Ads by CJ

స్టార్ మా లో ఈ ఆదివారం.. అంటే ఫిబ్రవరి 7న .. మరింత స్పెషల్ గా ఉండబోతోంది . అభిమాన సెలెబ్రిటీలు అందరూ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు లోగిళ్ళకు రాబోతున్న ఈ ఆదివారం వినోదం ఓ విందు భోజనంలా ఉండబోతోంది.

ప్రేక్షకులు ఎంతో అభిమానించే రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రేస్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ ప్రారంభం కోబోతోంది. తన మాటలతో మాయాజాలం చేసే సీనియర్ యాంకర్ సుమ స్టార్ట్ మ్యూజిక్ తో చేస్తున్న సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. గంటన్నర పాటు సెలెబ్రిటీలతో మ్యూజికల్ గా చేసే మేజిక్ కడుపుబ్బా నవ్విస్తుంది. నవ్వి నవ్వి అలసిపోయి, ఈ షో నుంచి కొద్దీ క్షణాలు రిలాక్స్ కాగానే 1.30 గంటలకు కామెడీ స్టార్స్ కంటిన్యూ అవుతుంది. యాంకర్ వర్షిణి చేసే అల్లరి, కామెడీ టీమ్స్ చేసే హంగామా, సెటైర్లు , పంచ్ లు, ఈలలు, గోలలు .. ఇక ఈ గంటన్నర సమయం తెలియకుండానే గడిచిపోతుంది.

ఇక సాయంకాలం ఆరు గంటలకు మరో వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్ సిద్ధంగా ఉంటుంది. అదే బిగ్ బాస్ ఉత్సవం. తెలుగు బుల్లితెర వినోదం లో సరికొత్త అధ్యాయంలా తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందించిన బిగ్ బాస్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఎంటర్ టైన్మెంట్ లైక్ నెవెర్ బిఫోర్ అనే టాగ్ లైన్ తో వచ్చిన సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ ఒకే వేదిక పైకి వచ్చి పండగ వాతావరణాన్ని సృష్టించబోతున్నారు. హౌస్ మేట్స్ లా వచ్చి స్టార్స్ అయిన కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ లా ఒక చోట కనిపించడం కన్నుల పండువ అయితే ... వాళ్ళు చేసే ఫన్ ఎప్పటికీ మరువరానిది.

సో.. ఈ ఆదివారం.. స్టార్ మా లో మీకు విందు భోజనం సిద్ధం గా వుంది. గెట్ రెడీ.

బిగ్ బాస్ ఉత్సవం ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/Pn2YVs60K84

Press release by: Indian Clicks, LLC

Celebrate this Sunday with Specials on Star Maa:

Celebrate this Sunday with Specials on Star Maa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ